»   » పాపం అంజలి,త్రిష మధ్య ఇరుక్కుపోయాడు

పాపం అంజలి,త్రిష మధ్య ఇరుక్కుపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఇద్దరు హీరోయిన్స్, మధ్యలో హీరో ...ఈ తరహా ముక్కోణపు ప్రేమ కథలు వెండితెరకు కొత్తేం కాదు. అయితే ప్రతీసారీ తమ దైన ట్రీట్ మెంట్ తో కొత్తగా చెప్పటానికి దర్శకులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి మరో త్రికోణపు ప్రేమ కథా చిత్రం త్వరలో మన ముందుకు రానుంది. జయం రవి, త్రిష, అంజలి, సూరి తదితరులు ముఖ్య తారాగణంగా 'అప్పాటక్కర్‌' రూపొందింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కథానుసారం సరదాగా తిరిగే జయం రవి కాలక్షేపం కోసం అంజలిని ప్రేమిస్తాడు. ఆమె మాత్రం నిజంగా ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలంటూ జయం రవిపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో తప్పించుకుని చెన్నై చేరిన జయం రవి... ఇక్కడ త్రిషను సీరియస్‌గా ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ ఇద్దరూ పొల్లాచ్చికి చేరుకోవడం, అక్కడ ఇంకా జయం రవి కోసం అంజలి నిరీక్షించడం, ఆమె త్రిషను కలుసుకోవడం... ఈ పరిణామాలతో వారి మధ్య చిక్కుకుని సూరి ఇబ్బంది పడటం వంటి సన్నివేశాలను తెరపై చూడాల్సిందేనని యూనిట్‌ చెబుతోంది. జయం రవి చివరకు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడనేదే క్త్లెమాక్స్‌.

Appatakkar has Jayam Ravi with Trisha and Anjali

పూర్తిస్థాయి హాస్య చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా జయం రవికి జోడీగా త్రిష నటిస్తోంది. అంజలి రీ ఎంట్రీ చిత్రంగా 'అప్పాటక్కర్‌' ప్రత్యేకత సంతరించుకుంది. 'అలెక్స్‌ పాండియన్‌' పరాజయం తర్వాత ఈ చిత్రంపై దర్శకుడు సురాజ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సురాజ్‌ దర్శకత్వంలో లక్ష్మీ మూవీ మేయర్స్‌ పతాకంపై దీన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. పొల్లాచ్చిలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష,అంజలిలకు ఇక్కడ మార్కెట్ ఉండటం ప్లస్ అవుతుంది.

English summary
Appatakkar is the upcoming movie of Jayam Ravi directed by Suraj staring Jayam Ravi opposite to Trisha and Anjali playing the lead roles and Soori is the hilarious part. Vivek also seems to be joining the team very early. The film will be released in early 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu