రేసు నుంచి తప్పుకున్న నయనతార
దర్శకుడు అట్లీ మాట్లాడుతూ... 'రాజారాణి' అద్భుత ప్రేమకథ. చాలా భిన్నంగా ఉంటుంది. నేటి యువతకు నచ్చేలా రూపొందించాం. జీవీ ప్రకాశ్ బాణీలు హైలెట్‌గా ఉంటాయి. ఇటీవల విడుదలైన పాటలు ప్రజాదరణ పొందుతున్నాయి. తెరపైకొచ్చాక మరింత ప్రాచుర్యం అవుతాయని దర్శకుడు అట్లీ చెప్పారు. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట. అలాగే....'రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు.
నయనతార సినిమా విడుదలకు సిద్దం అవడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మళయాలీల 'ఓనం'ఫెస్టివల్‌ను పురస్కరిచుకుని 'రాజారాణి' చిత్ర నిర్మాతలు నయనతార సంప్రదాయ కేరళ వస్త్రధారణలో ఉన్న ఫోటోలు విడుదల చేసారు. ఈ సాంప్రదాయ దుస్తువుల్లో నయనతార లుక్ అదిరిపోయింది, ఎంతో అందంగా కనిపిస్తోందని పొగిడేస్తున్నారు అభిమానులు. ఇటీవలే ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.
నయతార నటించిన సినిమా చాలా కాలం తర్వాత తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో ఆమె నటించిన 'బాస్ ఎంగిరా భాస్కరన్' చిత్రం 2010లో విడుదలైంది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం, ఇతర కారణాల వల్ల తమిళంలో సినిమాలేవీ చేయలేదు నయన. దీంతో అప్పటి నుంచి ఆమె సినిమాలేవీ తమిళంలో విడుదల కాలేదు. చాలా కాలం తర్వాత నయనతార తమిళంలో ఆర్యతో కలిసి 'రాజా రాణి' చిత్రంలో నటించింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. నయనతార సినిమా విడుదలకు సిద్దం అవడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications












