»   » చూస్తే కేక అని అంటారు:ఈ టీజర్, ఫస్ట్ లుక్ ఫొటోలు పొరపాటున మిస్సవకండి

చూస్తే కేక అని అంటారు:ఈ టీజర్, ఫస్ట్ లుక్ ఫొటోలు పొరపాటున మిస్సవకండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఏదో ఒక స్పెషాలిటి లేనిదే ఆర్య సినిమా ఒప్పుకోడు అంటారు. అలా ఎప్పటికప్పుడు విభిన్న కథలతో చిత్రాలను చేస్తూ వస్తున్న ఆర్య హీరోగా రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కదంబన్‌'. 'కదంబన్‌' ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను హీరో సూర్య,కార్తి ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు.

కేథరిన్‌ హీరోయిన్. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్నారు. యాక్షన్‌, అడ్వెంచర్‌ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్య ఏనుగుల మధ్య పరిగెత్తుకొస్తూ ఉన్న ఫొటో విశేషంగా అలరిస్తోంది.

ఈ చిత్రం పూర్తిగా అడవి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గిరిజనుడుగా ఆర్య కనిపించనున్నారు. ఆర్య పోషిస్తున్న పాత్ర పూర్తిగా అడివికే అంకితం అయిపోయి ఉంటుందని తెలుస్తోంది.

ఫెరఫెక్ట్ టీజర్

ఈ మధ్యకాలంలో ఇంతటి బ్రహ్మాండమైన టీజర్ లేదనిపించేలా ముస్తాబు చేసి వదిలారు. మీరు దీన్ని చూడండి.

శరీరంలో చాలా మార్పులు

శరీరంలో చాలా మార్పులు

ఇక కదంబన్ కోసం ఆర్య బాగా కష్టపడ్డాడని మనకీ టీజర్ ఫస్ట్ లుక్ లతో అర్దం అవుతోంది. బాగా కండలు పెంచేసి.. తన రూపంలో చాలానే మార్పులను తీసుకొచ్చాడు. గిరిజనుడి పాత్ర కోసం అన్ని రకాలుగాను.. తన శరీరంలో మార్పులు చూపించాడు.

అడివిలో తిరిగే రాంబో

అడివిలో తిరిగే రాంబో

సిక్స్ ప్యాక్ చేసిన అడవిలో తిరిగే రాంబో లాగా చేతిలో కర్ర పట్టుకున్న ఆర్య లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.

గ్రాఫిక్స్ కలిపి అదరకొట్టారు

గ్రాఫిక్స్ కలిపి అదరకొట్టారు

ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా కొడైకెనాల్ అడవులతో పాటు.. థాయ్ ల్యాండ్ లోని దట్టమైన అడవుల్లో చేశారు. నిజమైన అడవులకు కొద్దిగా గ్రాఫిక్స్ కూడా మిక్స్ చేసి.. అదరకొట్టారని తెలుస్తోంది. సినిమా జంగిల్ బుక్ లాగ పూర్తి అడవితో నిండిపోయి ఉంటుంది.

అదే హైలెట్

అదే హైలెట్

థాయ్ ల్యాండ్ లో 50 ఏనుగులతో ఆర్య చేసిన ఫైట్ ఈ చిత్రానికి హైలైట్ కానుందని చెప్తున్నారు. ప్రధానంగా విజువల్స్ ఈ చిత్రానికి స్పెషల్ కానున్నాయని తమిళ జనాలు అంటున్నారు.

సరైనోడు తర్వాత

సరైనోడు తర్వాత

కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించిన కదంబన్ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరి నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. కేధరిన్ పాత్ర సినిమాలో హైలెట్ గా ఉంటుందని, సరైనోడు చిత్రం మరోసారి క్రేజ్ తెచ్చే పాత్ర ఇదని తెలుస్తోంది. సంగీతం: డి.ఇమాన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.ఆర్‌. సతీష్‌కుమార్‌.

ఇక్కడేం టైటిల్ పెడతారో

ఇక్కడేం టైటిల్ పెడతారో

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడవి వీరుడు అనే టైటిల్ పెడతారేమో అంటున్నారు ఈ పస్ట్ లుక్ చూసిన వారంతా...ఈ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత తెలుగు నుంచి మంచి బిజినెస్ ఆఫర్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

పెద్ద స్కెచ్ వేసాడే

పెద్ద స్కెచ్ వేసాడే

ఈ సినిమా తో తెలుగు,మళయాళంలో మార్కెట్ గ్రాబ్ చెయ్యాలని ఆర్య ప్లాన్ అని తెలుస్తోంది. అందుకోసం ఆయన ఈ సినిమాకు ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు. కేథరిన్ ని తీసుకోవటం కూడా తెలుగు మార్కెట్ లో పాగా వెయ్యటానికే అంటున్నారు.

మన టార్జాన్

ఇక ఈ పోస్టర్స్ కు కేవలం అభిమానుల నుంచి మాత్రమే కాక సిని ప్రముఖలందరి నుంచీ ప్రశంశలు అందుతున్నాయి. పార్టీ టైమ్, టార్జాన్ లాగ ఉన్నావంటూ...

తమన్ సైతం ..

సంగీత దర్శకుడు తమన్ డెడికేషన్ అధ్బుతమంటూ మెచ్చుకున్నారు.అలాగే విశాల్, హన్సిక, సూర్య, కార్తీ ఇలావరసపెట్టి తమిళ సినీ ప్రముఖలంతా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

English summary
Suriya, Karthi and Vishal came together to support their colleague and friend Arya’s upcoming film Kadamban. The leading pack of young actors released the teaser and first look posters online even as they praised Arya’s look in the upcoming film, in which he plays a tribal character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu