»   » 'దూకుడు' తమిళ వెర్షన్ విడుదల తేదీ ఖరారు

'దూకుడు' తమిళ వెర్షన్ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : తెలుగులో వసూళ్లవర్షం కురిపించిన 'దూకుడు' కోలీవుడ్‌లో 'అదిరడి వేటె'గా సత్తా చాటేందుకు సిద్ధమైంది. దర్శకుడు శ్రీనువైట్ల, కథానాయకుడు మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి తెలుగులో ఘన విజయం సాధించింది. సమంత కథానాయిక. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌.. మహేష్‌ తండ్రిపాత్రలో కనిపించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని 'అదిరడి వేట్త్టె' పేరిట 12న తమిళంలో విడుదల చేస్తున్నారు.


మహేష్‌బాబుకు తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం, అనువాదాలుగా వస్తున్న ఆయన చిత్రాలు చక్కని ప్రారంభ వసూళ్లు సాధిస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సినిమాని తమిళంలోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మహేంద్రన్‌ కుమారుడు జాన్‌ మహేంద్రన్‌ మాటలు రాశారు.

ప్రజలకు సేవచేసి విశ్వాసపాత్రుడిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యేను ప్రత్యర్థులు హతమార్చడం, వారిని ఎమ్మెల్యే కుమారుడు పథకం ప్రకారం తుదముట్టించడం చివరకు తన తండ్రి బతికే ఉన్నారనే నిజాన్ని ప్రత్యర్థులకు తెలియజేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో స్క్రీన్‌ప్లే సినిమా సాగుతుంది. ప్రస్తుతం అనువాద పనులు పూర్తయ్యాయి. వచ్చేనెలలో జనం మధ్యకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక దూకుడు చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇదే టీమ్ 'ఆగడు' అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆగడు సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

English summary
"Dookudu" movie was super duper hit at the box office. With his fan following Tamil dubbing rights of "Dookudu" movie are on higher side. Currently his superhit movie "Dookudu" will be releasing as "Athiradi Vettai." Plans are on to release the film in a grand manner soon. Samantha, Prakash Raj, Sonu Sood featured in the film. Srinu Vaitla directed the movie.
Please Wait while comments are loading...