బట్టలు చించి,కొట్టి నటిపై దాడి, నిందితుల కోసం గాలింపు
చెన్నై: హీరోయిన్ కు చెల్లెలు,స్నేహితురాలు తరహా వేషాలు వేసే నటిపై దాడి చేసిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడు తేని జిల్లా, దేవదానపట్టి దక్షిణ వీధికి చెందిన మూక్కన్ కుమార్తె మురుగేశ్వరి (38) కి జరిగింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మురగేశ్వరి... నాన్ కడవుల్ (నేనే దేవుడ్ని) చిత్రంలో నటి పూజకు ఆమె స్నేహితురాలిగా నటించారు. మురుగేశ్వరి శనివారం వత్సలగుండుకు వెళ్లి అక్కడ నుంచి బస్సులో దేవదానపట్టికి వస్తున్నారు. బస్టాప్‌లో దిగి ఇంటికి నడిచి వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన చిన్నపాండి (17), తంగపాండి (17) మురుగేశ్వరిని అటకాయించి దాడి చేశారు.

తరువాత ఆమె ధరించిన వస్త్రాన్ని చింపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన మురుగేశ్వరి కేకలు వేయటంతో దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నపాండి,తంగపాండిల కోసం గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











