»   » ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? : సీక్రెట్ రివీల్ చేసిన కట్టప్ప కొడుకు

‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? : సీక్రెట్ రివీల్ చేసిన కట్టప్ప కొడుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఎందుకు చంపాడనే సీక్రెట్ ని కట్టప్ప(సత్యరాజ్)కుమారుడు శిబిరాజ్ రివీల్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


శిబిరాజ్ తాజా చిత్రం జాక్సన్ దొరై విడుదల సందర్భంగా మీడియావారు ఇదే ప్రశ్నను అడిగితే దానికి సమాధానమిస్తూ... "బాహుబలి పాత్రలో రాజమౌళి నన్ను తీసుకోలేదు. అందుకే మా నాన్నకు కోపం వచ్చి బాహుబలినే చంపేసాడు" అని ఫన్నీగా సమాధానమిచ్చాడు.


ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.


బాహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది.


Baahubali Murder secret revealed by Sibiraj

ఇక జాక్సన్ దొరై చిత్రం విషయానికి వస్తే...


ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై పెద్ద హిట్టైంది. శిబిరాజ్ నటిస్తున్న ఈ తమిళ సినిమాలోను సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శిబిరాజ్, బింధు మాధవి హీరో హీరోయిన్లుగా.. ధరణి ధరన్ దర్శకత్వంలో జాక్సన్ దురై అనే సినిమా తెరకెక్కుతోంది.


కొడుకు శిబిరాజ్ నటిస్తున్న 'జాక్సన్ దురై'లో సత్యరాజ్ పోషిస్తున్న పాత్రే ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది. విశేషం ఏమంటే.... ఇందులో దెయ్యంగా కనిపించనున్నాడట సత్యరాజ్. క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సత్యరాజ్ ఒక్కసారిగా ఘోస్ట్ గా నటిస్తుండడంతో ఈ సినిమా పై కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.


ఈ సినిమాలో సత్యరాజ్ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారట దర్శక నిర్మాతలు. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న జాక్సన్ దురై లో కేవలం మూడు పాటలే ఉంటాయట. మరి దెయ్యంగా మారబోతున్న సత్యరాజ్ జనాలను ఎలా భయ పెడతాడో చూడాలి.

English summary
Sibiraj speaking about his upcoming film come across the 'Why di d Kattapa (Sathyaraj) killed Baahubali (Prabhas)'.from media folks and he answered "Since Rajamouli did not cast me in the role of Baahubali, appa got angry and killed him".
Please Wait while comments are loading...