»   » తెలుగు సంఘాలకి భారతిరాజా సీరియస్ వార్నింగ్

తెలుగు సంఘాలకి భారతిరాజా సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bharathi Raja comes in for Vadivelu's rescue
చెన్నై : వడివేలు హీరోగా వస్తున్న 'తెనాలిరామన్‌' విడుదలను వ్యతిరేకిస్తున్నవారు తమ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమిళ సీనియర్‌ దర్శకుడు భారతిరాజా హెచ్చరించారు. వడివేలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తెనాలిరామన్‌'పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. సమీప కాలంగా తమిళ సినీ పరిశ్రమను, తమిళ సినీ కళాకారులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెనాలిరామన్‌ వివాదం కూడా అందులో భాగంగానే తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిన్నటి విశ్వరూపం నుంచి నేటి తెనాలిరామన్‌ వరకు సెన్సార్‌ పూర్తెన చిత్రాలకు సైతం వ్యతిరేకత తెలపటం చూస్తుంటే కొందరికి తమిళ భాషపైనా, సినీ పరిశ్రమ, కళాకారులపైన ఏదో దురుద్ధేశం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందినవారినే అపహాస్యం చేస్తూ కార్టూన్లు గీసినవారున్నారని, అది వారికున్న స్వేచ్ఛ అని తెలిపారు. తెలుగు మాట్లాడిన తెనాలిరామన్‌ కథ కాబట్టి అక్కడక్కడా తెలుగు సంభాషణలు రావటం సహజమని, దాన్ని పరిగణలోకి తీసుకుని విడుదలకు ముందే తమకు చిత్రాన్ని చూపించాలనటం, కోర్టుకు వెళ్లటం ఎంతవరకు న్యాయమన్నారు.

అలాంటప్పుడు సెన్సార్‌బోర్డు అంటూ ఎందుకని ఘాటుగా ప్రశ్నించారు. నేడు వడివేలుకు వచ్చిన సమస్య రేపు మరో తమిళ కళాకారుడికి వచ్చే అవకాశాలున్నాయని, కావున ఈ సమస్యపై తమిళ కళాకారులంతా ఐక్యతగా పోరాడి మంచి పరిష్కారం కనుగొనాలని భారతిరాజా తన ప్రకటనలో కోరారు.

ఇదిలా ఉంటే 'తెనాలిరామన్‌' పై చిత్ర వివాదానికి సంబంధించి మంగళవారం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుగు సంఘాల ప్రతినిధులు తెలిపారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సీఎమ్‌కే రెడ్డి, తంగుటూరి రామకృష్ణ తదితరులు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తెనాలిరామన్‌కు సంబంధించి తమ అభ్యంతరాలను చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో తదితరులకు ఎన్నో విధాలుగా తెలిపామని, అయితే వారి నుంచి సానుకూల స్పందన రాకపోవటంతోనే శాంతియుత నిరసన కార్యక్రమానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

తమ నిరసన తమిళభాష, మరే ఇతర భాషకు వ్యతిరేకం కాదని, తమిళ భాష సినీ కళాకారులన్నా, సాంకేతిక నిపుణులన్నా తమకు అపార గౌరవ మర్యాదలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే చరిత్రను వక్రీకరించి గొప్ప వ్యక్తులను కించపరిచే విధంగా చిత్రాలను తెరకెక్కించటం ఎంతవరకు సమంజసమన్నారు. సినిమాలో నిజంగా తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సన్నివేశాలు లేకుంటే.. సినిమాను తమకు ప్రదర్శించేందుకు వెనకంజ ఎందుకని ప్రశ్నించారు.

శాంతియుత నిరసన కార్యక్రమంలో తమతో పాటు కన్నడ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని, అలాగే భాషలతో సంబంధం లేకుండా శ్రీ కృష్ణదేవరాయులని, తెనాలి రామకృష్ణుడిని అభిమానించే ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం కూడా సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. ఎన్నికల సమయం కావటంతో కొన్ని దుష్ట శక్తులు తెలుగు సంఘాల ముసుగులో అలజడలు సృష్టించి, ఆ అల్లర్లను తెలుగు సంఘాలపై నెట్టే అవకాశముందని ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary

 Senior director Bharathi Raja has joined the cause of supporting Vadivelu's comeback film Thenaliraman. The septuagenarian director has sent a detailed five page statement condemning the trend of protesting against Tamil films that have been censored and allowed for public viewing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu