»   » కార్తీ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఇండస్ట్రీ షాక్, తల్లీ కంప్లైంట్

కార్తీ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఇండస్ట్రీ షాక్, తల్లీ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బిచ్చగాడు(పిచ్చైక్కారన్) చిత్ర హీరోయిన్ సాట్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో "నేనో తింగరబుచ్చీ" అంటూ పాట పాడి బిచ్చగాడిని ప్రేమించిన హీరోయిన్ సాట్నా టైటస్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే విషయం తాగాజా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై తన కూతురుని మోసం చేశారని మాయమాటలు చెప్పి నమ్మించారని ఆమె తల్లి నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. నటి సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా మళ్లీ వివాహం చేసుకుంటామని పేర్కొనడం గమనార్హం. ఏది నిజం..ఏది అబద్దం అని ఇప్పుడు నడిగర సంఘం తలపట్టుకు కూర్చుందిట.

స్లైడ్ షోలో వీరి ప్రేమాయణం ఎలా మొదలైందనే విశేషాలు...

తెలుగులోనూ సూపర్ హిట్టే

తెలుగులోనూ సూపర్ హిట్టే

సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన నటి సాట్నాటైటస్. ఆ చిత్రం తమిళంలో విజయవంతమైన విషయం, అంతకంటే సంచలన విజయాన్ని అనువాద చిత్రంగా తెలుగులో సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే చిత్రం తనకు కెరీర్ తో పాటు జీవితాన్ని కూడా ఇస్తుందని ఆమె ఊహించలేదంటోంది.

మీడియా సమక్షణంలో మొదలైన ప్రేమ

మీడియా సమక్షణంలో మొదలైన ప్రేమ

బిచ్చగాడు హిట్ తో నటి సాట్నాకు తమిళ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు రావడం మెదలెట్టాయి. అయితే పిచ్చైక్కారన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ప్రెస్ మీట్ లో తొలి పరిచయం జరిగింది. అది ప్రేమగా తర్వాత మొగ్గ తొడిగింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

రిజిస్టర్ చేసుకున్నారు ఇంతకు ముందే

రిజిస్టర్ చేసుకున్నారు ఇంతకు ముందే

నెల రోజుల ముందే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం కాస్త ఆలస్యంగా బయట పడింది. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎక్కడా బయిటపొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆమె తల్లి ఈ విషయం గమనించి అల్లరి చేసింది. ఆ గొడవ పెద్దది కాకుండానే ఈ లోగా వీళ్లిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. దాంతో ఇప్పుడా తల్లి వీరిపై మండిపడుతోంది.

 ప్రశ్నార్దంకగా...

ప్రశ్నార్దంకగా...

దీంతో సాట్నా నటించడానికి అంగీకరించిన తిట్టం పోట్టు తిరుడర కూట్టం చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అదే విధంగా అమీర్ దర్శకత్వంలో నటించడానికి సంగదేవన్ చిత్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పుడు వారు తమ చిత్రాల్లో వేరే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే తమకు ఆమె ముందే చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదంటున్నారు

పెళ్లి తర్వాత ఏం చేయనున్నారంటే

పెళ్లి తర్వాత ఏం చేయనున్నారంటే

తన భార్య సాట్నా చిత్రాలను తగ్గించుకుంటున్నార ని, పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పనున్నారని, ఇది తామిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. మరి వీరి వివాహ తంతు ఎటు దారి తీస్తుందో చూద్దాం అంటోంది తమిళ సినీ పరిశ్రమ. సాట్నా సైతం గ్యాప్ తీసుకుంటాను కానీ పూర్తిగా సినిమాలు మానేది లేదని స్పష్టం చేసింది.

 లేటుగా తెలుసుకున్నాను

లేటుగా తెలుసుకున్నాను

ఇక సాట్నాని వివాహం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ కార్తీ ...తమ వివాహ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. బిచ్చగాడు ప్రమోషన్ సమయంలోనే ఆమెను తొలిసారి చూసానని, ప్రేమలో పడ్డానని అన్నారు. మొదట తాము స్నేహితులుగా ఉన్నామని ,తర్వాత తెలియకుండానే ప్రేమలో పడ్డామని, ఆ విషయం లేటుగా తెలుసుకున్నామని అన్నారు.

 న్యాయం జరిగేదాకా పోరాడతా

న్యాయం జరిగేదాకా పోరాడతా

పెళ్లి చేసుకున్న హీరోయిన్ తల్లి సాట్నా ఓ లీడింగ్ డైలీకు ఇంటర్వూ ఇస్తూ...తమ అనుమతి లేకుండానే వివాహం చేసుకున్నారని, తన కూతురు కెరీర్ ని కార్తీ కాపురం పేరుతో నాశనం చేయటానికి సిద్దపడుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా తనకు న్యాయం జరిగేలా చేయమని నడిగర్ సంఘాన్ని కోరానని ఆమె తెలియచేసింది.

మంచి కుటుంబం నుంచే

మంచి కుటుంబం నుంచే

సాట్నా ..డబ్బు కోసం వివాహం చేసుకుంది ఓ డిస్ట్ర్రిబ్యూటర్ ని అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆమె అభిమానులు ఖండనలు చేస్తున్నారు. ఆమెకు అలాంటి అవసరం లేదని, ఆమె ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తె అనే విషయం గుర్తు చేస్తున్నారు. ఆమె కుటుంబం వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఆ అవసరం లేదని తెలుస్తున్నారు.

ఆఫర్సే ఆఫర్స్

ఆఫర్సే ఆఫర్స్

సాట్నా..తొలి చిత్రం విజయ్ ఆంటోని సరసన చేసిన పిచ్చైకారన్. బిచ్చగాడుగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టై, కనక వర్షం కురిపించింది. ఈ నేపధ్యంలో ఆమెకు ఆఫర్స్ గుమ్మం తట్టాయి.. అందరి హీరోల, దర్శకుల దృష్టి ఆమెపై పడింది. ఆమె క్రేజ్ చూసి పెద్ద పెద్ద నిర్మాతలు సైతం డేట్స్ కోసం ఎగబడ్డారు.

కాస్త సెటిలయ్యాక అయితే ...

కాస్త సెటిలయ్యాక అయితే ...

సాట్నా ది ఇప్పడిప్పుడే ప్రారంభమైన కెరీర్ అని, కొద్ది రోజులు ఆగి వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే బాగుండేదని సినిమా వర్గాలు అంటున్నాయి. పర్శనల్ లైప్ లో పెళ్లి అనే ఘట్టం ముగిసాక హీరోయిన్ గా కెరీర్ పడిపోయినట్లే అని చెప్తున్నారు. అయితే పెళ్లైన తర్వాత కూడా ఆఫర్స్ తెచ్చుకుని ముందుకు వెళ్లినవారు ఉన్నారనే సంగతి తెలిసిందే.

 సీన్ రిపీట్ కాకుండా

సీన్ రిపీట్ కాకుండా

ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ గా నడిచిన అంశం...అమలాపాల్, ఎ ఎల్ విజయ్ ల వివాహం, బ్రేక్ అప్, విడాకులు. పెళ్లైన కొద్ది రోజులుకు మళ్లీకెరీర్ పునర్ నిర్మించుకోవాలని హీరోయిన్స్ ఆశపడటం సహజమే. అయితే అందుకు కుటుంబం సహకరించాల్సి ఉంటుంది. సహకరించనప్పుడు అమలాపాల్ విడాకులగా మారుతుంది. అలాంటి పరిస్దితి రిపీట్ కాకుండా ఉండాల్సిన అవసరం, జాగ్రత్తలు తీసుకోవాలి.

 మాకెందుకీ తలనొప్పి

మాకెందుకీ తలనొప్పి

చక్కగా ప్రేమించి వివాహం చేసుకున్న సాట్నా బాగానే ఉంది. ఇప్పుడు సాట్నా తల్లి మాయ మాత్రం తన కుమార్తెను మాయ చేసి కార్తి పెళ్లి చేసుకున్నాడని , నడిగర సంఘంలో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికే నడిగర సంఘం రకరకాల సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో ఇలాంటి కంప్లైంట్ లు కూడా వస్తే కష్టమని అని విసుక్కుంటున్నారు.

వివాహ శుబాకాంక్షలు

వివాహ శుబాకాంక్షలు

బిచ్చగాడు చిత్రంతో తెలుగువారికి సైతం సన్నిహితమైంది సాట్నా. ఆమె అమాయికంగా చూసే చూపులు, ఆమె ఎక్సప్రెషన్స్ ఇక్కడివారికి నచ్చాయి. వివాహానంతరం కూడా ఆమె సినిమాలు చెయ్యాలని కోరుకుంటూ ఈ సందర్బంగా సాట్నాకు వన్ ఇండియా తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. మీరు కూడా ఆమెకు విషెష్ ని క్రింద కామెంట్స్ కాలంలో తెలియచేయవచ్చు.

English summary
Satna Titus the heroine of Vijay Antony in ‘Pichaikaaran’ has reportedly married Karthi the distributor of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu