For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రాణాలు తీసేస్తాం.. బిగ్‌బాస్ సెలబ్రిటీకి భయంకరంగా బెదిరింపులు.. ప్రైవేట్ నంబర్‌కు ఫోన్ చేసి..!

  |

  తమిళనాడు చిత్ర పరిశ్రమలో మోడల్‌గా, నటిగా రాణిస్తున్న సనమ్ శెట్టి ఏదో రూపంలో వార్తల్లో ఉండటం చూస్తూ ఉంటాం. తాజాగా తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, సోషల్ మీడియాలో కొందరు రెగ్యులర్‌గా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెన్నై పోలీతసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అకతాయిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

  అదితిరావు హైదరీ బ్యూటీఫుల్ ఫోటోగ్యాలరీ.. ఇలాంటి అందాలను మీరు ఎప్పుడైనా చూశారా?

  చంపి వేస్తాం.. బెదిరింపులతో

  చంపి వేస్తాం.. బెదిరింపులతో

  నాకు కొద్ది రోజులుగా చంపి వేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా నా పనేదో నేను చూసుకొంటున్నాను. కానీ ఈ మధ్య కాలంలో బెదిరింపులు ఎక్కువ కావడంతో నేను ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకొన్నాను. వెంటనే బెదిరింపుల వ్యవహారాన్ని పోలీసులకు చేరవేసి కంప్లైయింట్ నమోదు చేశాను.

  అర్జున్ సర్జా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయ ఫోటోలు చూశారా?

  భయంకరంగా బెదిరింపులు

  భయంకరంగా బెదిరింపులు

  కొద్ది నెలలుగా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో చంపివేస్తామని భయంకరంగా బెదిరిస్తున్నారు. నా పర్సనల్ ప్రైవేట్ నంబర్‌కు మెసేజ్ చేస్తూ నా ఫ్యామిలీని, నన్ను చంపివేస్తామని వేధిస్తున్నారు దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. దాంతో వారి ఆటకట్టించారు. ఇలా వేధింపులకు గురి అవుతున్న ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అకతాయిలా ఆగడాలకు చెక్ పడుతుంది అని సనమ్ శెట్టి అన్నారు.

  ప్రభుత్వ లాంఛనాలతో దిలీప్ కుమార్ అంత్యక్రియలు పూర్తి.. బాలీవుడ్ దిగ్గజాలు హాజరు

  పోలీసుల రంగంలోకి దూకి..

  పోలీసుల రంగంలోకి దూకి..

  సనమ్ శెట్టి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన చెన్నై పోలీసులు.. వేధింపులకు పాల్పడే వ్యక్తిని రాయ్ జాన్ పాల్‌గా గుర్తించారు. వెంటనే తగు చర్యలు తీసుకొని పాల్‌ను అదుపులోకి తీసుకొన్నారు. బెదిరింపుల వెనుక కారణం, ఎవరి ప్రోద్బలం ఏమైనా ఉందా అనే కోణంలో పాల్‌ను విచారిస్తున్నారు.

  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!

  చెన్నై పోలీసులకు థ్యాంక్స్

  చెన్నై పోలీసులకు థ్యాంక్స్

  ఈ క్రమంలో తనపై వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న నేపథ్యంలో సనమ్ శెట్టి తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. చెన్నై పోలీసులకు, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్ అంటూ తన పోస్టులో పేర్కొనారు. జిల్లా ఎస్పీ అడయార్‌కు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

  SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
  పోలీసుల సహాయం కోరండి అంటూ

  పోలీసుల సహాయం కోరండి అంటూ

  సినీ ప్రముఖులను, సాధారణ ప్రజలను ఇలా వేధించడం సరికాదు. ఎవరైనా ఇలాంటి బాధలు పడితే వెంటనే సహాయం కోసం పోలీసులను ఆర్థించండి. పోలీసులు సహృదయంతో పౌరులను ఆదుకొంటారు. కొద్ది రోజులుగా వేధింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో నాకు అండగా నిలిచి నాకు సహాయం చేసిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అంటూ సనమ్ శెట్టి తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

  English summary
  Bigg Boss Tamil Beauty Sanam Shetty gets death threats, One arrested in this case. Then she wrote in instagram that, My heartfelt thanks to the Chennai Police Department chennaicorp greater_chennai_police_Cyber Crime Department and District Commissioner sir (Adyar) for helping me I would like to clarify to the Press that this is NOT pornography related abuse.It is repeated death threats. Kindly update the information reported.Thanks for the support
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X