»   » పాప ఫేటే మారిపోయింది: మేడమ్ కి బిగ్‌బాస్ తెచ్చిన స్టార్‌డమ్ ఇది

పాప ఫేటే మారిపోయింది: మేడమ్ కి బిగ్‌బాస్ తెచ్చిన స్టార్‌డమ్ ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ లో నిన్నా మొన్నటి వరకూ ఓవియా అనే నటి ఉందీ అని చాలా తక్కువమందికే తెలుసు. పాపం చాలా ఏళ్ళుగా ఒక్కటంటే ఒక్క బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఆ బ్రేక్ ఇప్పుడు బిగ్ బాస్ రూపం లోవచ్చింది. ఒక్క సారిగా అమ్మడి రేంజ్ మారిపోయింది ఈ రియాలిటీ షో వల్ల. చిట్టి నిక్కర్లు వేసుకుని ప్రేక్షకులని రెచ్చగొట్టేలా నవ్వులు విసురుతూ 'క్యూటీ పై' వేషాలతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. తర్వాత తనపై బిగ్‌బాస్‌ హౌస్‌లో పాలిటిక్స్‌ జరిగితే అన్నిటికీ గట్టిగా బదులిచ్చి మరీ నిలబడింది.

Oviya helen Photo gallery

ఓవియా ఆర్మీ

ఓవియా ఆర్మీ

బిగ్‌బాస్ కొనసాగుతూండగానే బయట ఓవియా ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో తనకో సైన్యం ఏర్పడింది. తమిళ బిగ్‌బాస్‌కి టీఆర్పీలు పెరగడంలో దోహదపడిన ఓవియా హౌస్‌లో జరిగే రాజకీయాలతో పడలేక బయటకి వాకౌట్‌ చేసింది. అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేసి సగంలో వచ్చేసినా కానీ ఓవియా ఇప్పుడు తమిళనాడులో చాలా ఖ్యాతి గడించింది.

 భారీ ఆఫర్లతో

భారీ ఆఫర్లతో

అందుకే ఆమెతో సినిమాలు తీయడానికి పలువురు నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు. అంతేకాదు రకరకాల కంపెనీలు ఆమెతో ఎండార్స్మెంట్ల కోసం ఎగబడుతున్నాయట. ఆమెని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవటానికి కొన్ని మాల్స్ ఇప్పటికే భారీ ఆఫర్లతో ఎదురుచూస్తున్నాయట.

 తమన్నాని తప్పించిమరీ

తమన్నాని తప్పించిమరీ

ఇప్పటికే ఒక హాట్ టాపిక్ ఏమిటంటే ఒక వస్త్రాల షోరూం ప్రకటన లో హన్సికా, తమన్నా చేస్తుండగా ఇప్పుడు తమన్నాని తప్పించిమరీ ఆ స్థానం లో ఈ బిగ్ బాస్ సుందరిని పెట్టుకున్నారట. తమన్నా లాంటి హీరోయిన్ ని పక్కకినెట్టి మరీ దూసుకుపోతోంది పాప. ముని/కాంచన సిరీస్‌లో మరో చిత్రం చేయడానికి ఉవ్విళ్లూరుతోన్న లారెన్స్‌ ఆ సినిమాలో ఓవియాని తీసుకున్నాడని సమాచారం.

 యూత్‌నుంచి స్పందన వుంటుందని

యూత్‌నుంచి స్పందన వుంటుందని

ఓవియా వల్ల యూత్‌నుంచి స్పందన బాగా ఎక్కువ వుంటుందని మిగతా హీరోయిన్లని కాదని ఆమెని తీసుకున్నాడట. నిన్నమొన్నటి వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ అమ్మడికి ఇప్పుడు అదృష్టం తలుపు తట్టి మరీ లేపుతోంది.

English summary
Bigg Boss Tamil breakout star Oviya has been roped to endorse a popular retail chain, which has actors Tamannaah and Hansika Motwani as its brand ambassadors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu