»   » అలాంటి పిచ్చి టాస్క్‌లు ఇస్తే ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా తప్పుకుంటా!

అలాంటి పిచ్చి టాస్క్‌లు ఇస్తే ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా తప్పుకుంటా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళంలో 'బిగ్ బాస్' రియాల్టీ షో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు కంటే ముందే తమిళంలో మొదలైన ఈ షో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల బిగ్ బాస్ ఇంట్లో నటి ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు తమిళనాడులో సంచలనం అయింది.

షో జరుగుతున్న తీరుపై తమిళనాడులో మొదటి నుండి ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు కేసులు కూడా పెట్టారు. తాజాగా షో జరుగుతున్న తీరుపై హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది.

బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లపై కమల్ అసహనం

బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లపై కమల్ అసహనం

తమిళ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న టాస్క్‌లపై కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ బిగ్ బాస్ తీరును ఎండగట్టారు.

Bigg Boss Tamil : Case Filed Against Kamal Haasan for his show
అభ్యంతరంగా ఉన్న బిగ్ బాస్ టాస్క్ ఇదే..

అభ్యంతరంగా ఉన్న బిగ్ బాస్ టాస్క్ ఇదే..

ఇంటి సభ్యులకు ఇటీవల బిగ్ బాస్ ఓ టాస్క్ అప్పగించారు. లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ ఎర్న్ చేయడానికి మానసిక వికలాంగులుగా నటించాలని సూచించారు. ఈ టాస్క్ మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇలాంటి పిచ్చి టాస్క్‌లు వద్దు

ఇలాంటి పిచ్చి టాస్క్‌లు వద్దు

బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ మీద కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి టాస్క్ లు చేసి వికలాంగుల మనోభావాలను దెబ్బతీయవద్దని, ఈ తరహా టాస్క్ లు మళ్లీ ఇవ్వవద్దని బిగ్ బాస్ బృందాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

రిపీట్ అయితే తప్పుకుంటాను

రిపీట్ అయితే తప్పుకుంటాను

తమిళ బిగ్ బాస్ ఇంట్లో ఇలాంటి సంఘటనలు, టాస్క్‌లు మళ్లీ రిపీట్ అయితే ఈ షో నుంచి తాను తప్పుకుంటానని కమల్ హాసన్ హెచ్చరించారు.

తన సినిమాల్లో అలా ఉండదు

తన సినిమాల్లో అలా ఉండదు

నా సినిమాల్లో మానసిక వికలాంగుల పాత్రలు ఉండవు. ఒక వేళ ఉన్నా...కామెడీగా చూపించనని అన్నారు. తన సినిమాలో మానసిక వికలాంగుడి పాత్ర కనుక ఉంటే అతడే సినిమాలో హీరోగా ఉంటాడని తెలిపారు.

ఇలాంటివి ఉంటాయని తెలియదు

ఇలాంటివి ఉంటాయని తెలియదు

బిగ్ బాస్ రియాల్టీ షో అనేది ముందుగా ప్లాన్ చేసి స్క్రిప్టు ప్రకారం జరిగే షో కాదు. అందు వల్ల ఇందులో ఏం జరుగుతుందో ముందే చెప్పలేం. ఇలాంటి టాస్క్ లు ఉంటాయని తాను అసలు ఊహించలేదని కమల్ హాసన్ తెలిపారు. ఇలాంటి పిచ్చి టాస్క్ లను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయనని తెలిపారు.

బిగ్ బాస్ ఆలోచించాలి

బిగ్ బాస్ ఆలోచించాలి

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఏదైనా టాస్క్ఇచ్చే ముందు నిర్వాహకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. వాటి వాల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయా? లేదా? అనేది బేరీజు వేసుకున్న తర్వతే నిర్ణయం తీసుకోవాలని అని కమల్ హాసన్ అభిప్రాయ పడ్డారు.

బిగ్ బాస్: కమల్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు

బిగ్ బాస్: కమల్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు

తమిళంలో బిగ్ బాస్ రియాల్టీషో హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ మీద రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది.

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

తొక్కేయాలని చూశారు, రేపు రజనీ వచ్చినా విమర్శిస్తా: కమల్ హాసన్

తొక్కేయాలని చూశారు, రేపు రజనీ వచ్చినా విమర్శిస్తా: కమల్ హాసన్

తన మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా చెప్పే నటుల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఒకరు. ఎదుటి వారు అధికార పార్టీ వారైనా కమల్ మాటలో మార్పు ఉండదు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Actor Kamal Haasan, who is currently hosting the Tamil version of Bigg Boss, has threatened to quit as he is upset with the makers of the show, reported Indian Express.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu