twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో విజయ్‌పై భగ్గుమన్న బీజేపీ.. ఆ డైలాగ్స్ తొలగించాలి.. కొత్త వివాదంలో మెర్సల్‌..

    తమిళ చిత్రసీమలో ఇలయ దళపతి విజయ్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై తాజాగా విడుదలైన మెర్సల్ చిత్రంలో హీరో విజయ్ విమర్శనాస్త్రాలు భారీగా సంధ

    By Rajababu
    |

    తమిళ చిత్రసీమలో ఇలయ దళపతి విజయ్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై తాజాగా విడుదలైన మెర్సల్ చిత్రంలో హీరో విజయ్ విమర్శనాస్త్రాలు భారీగా సంధించాడు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని డైలాగ్స్‌ను తొలగించాల్సిందేనని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మెర్సల్ మరో వివాదంలో చిక్కుకున్నది.

    అక్రమ దందాలపై మెర్సల్

    అక్రమ దందాలపై మెర్సల్

    మెడికల్, హెల్త్ రంగాల్లో వేళ్లూనుకొన్న అక్రమ దందాలపై మెర్సల్ చిత్రం సూటిగా ప్రశ్నించింది. పేద ప్రజలకు అందాల్సిన వైద్యంపై 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంపై ప్రభుత్వాలను సినిమాలో హీరో విజయ్ తీవ్రంగా విమర్శిస్తాడు.

    జీఎస్టీపై విజయ్ ఎటాక్

    జీఎస్టీపై విజయ్ ఎటాక్

    క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో.. సింగపూర్‌లో వైద్య సేవలపై జీఎస్టీ కేవలం 7 శాతం. అయితే అక్కడ ఉచితంగా మందులు ఇస్తారు. కానీ మనదేశంలో అదే వైద్య సేవలపై విధించేంది 28 శాతం, అదనంగా మందుల కొనుగోలుపై 12 శాతం పన్ను విధిస్తారు. ఇదెక్కడి న్యాయం. పేద కుటుంబాలకు శాపంగా మారిన మద్యంపై ఇక్కడ ఎలాంటి పన్ను ఉండదు. ఇది మన ప్రభుత్వాల తీరు అని హీరో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

    మెర్సల్ డైలాగ్స్‌పై బీజేపీ అభ్యంతరం

    మెర్సల్ డైలాగ్స్‌పై బీజేపీ అభ్యంతరం

    జీఎస్టీని టార్గెట్ చేసుకొని సినిమాలో విజయ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలు సరికాదు. వెంటనే ఆ డైలాగ్స్‌ను తొలగించాలి అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    మెర్సల్ డైలాగ్స్‌ను తొలగించాలి

    మెర్సల్ డైలాగ్స్‌ను తొలగించాలి

    కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై కొన్ని సన్నివేశాల్లో హీరో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. వాటిని వెంటనే సినిమా నుంచి తొలగించాలి. ఆ డైలాగ్స్‌ విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అద్దంపడుతున్నాయి అని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిలిసాయి సౌందర్‌రాజన్ విమర్శించాడు.

    కేంద్రంపై విమర్శలు తగదు..

    కేంద్రంపై విమర్శలు తగదు..

    మెర్సల్ చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. చూసిన వారు ఆ డైలాగ్స్‌ను నా దృష్టికి తెచ్చారు. అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. కేంద్ర అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా, జీఎస్టీ కార్యక్రమాలపై సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి అని సౌందర్‌రాజన్ అన్నారు.

    రెండు రోజుల్లో 70 కోట్లు

    రెండు రోజుల్లో 70 కోట్లు

    మెడికల్ మాఫియాపై ఎక్కుపెట్టిన అస్త్రంగా మెర్సల్ రూపొందింది. ఈ చిత్రంలో విజయ్, కాజల్, సమంత, నిత్యామీనన్, ఎస్జే సూర్య తదితరులు నటించారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం 70 కోట్లు వసూలు చేసింది.

    English summary
    The BJP (Bharatiya Janata Party) on Thursday objected to some of the 'incorrect' references on GST (Goods and Services Tax) in Mersal. Apart from this, Mersal has reportedly raked in Rs 70 crore in just two days. Directed by Atlee, Mersal tells the story of Vetri and Maaran, who fight against medical mafia. Despite mixed reviews, the film was highly appreciated for Vijay's performance as Thalapathy. Produced by Sri Thenandal Films, the film also stars Nithya Menen, Kajal Aggarwal, Samantha, SJ Suryah and Vadivelu in important roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X