twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    9 థియేటర్లకు బాంబు బెదిరింపు..బుకింగ్ ఆపారు

    By Srikanya
    |

    చెన్నై : థియేటర్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావటంతో అందరూ ఎలెర్ట్ అవ్వాల్సిన పరిస్ధితి తమిళనాట ఏర్పడింది. 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తొమ్మిదోతేదీన తలైవా (అన్న) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ సినిమా విడుదలవుతున్న చెన్నైలోని తొమ్మిది థియేటర్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో తొమ్మిది థియేటర్లకూ భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా బాంబు బెదిరింపు కారణంగా ఈ థియేటర్లలో రిజర్వేషన్‌ ప్రక్రియను ఆపేశారు. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

    స్థానిక మైలాపూర్‌లోని సిటీసెంటర్‌లో ఐనాక్స్‌ థియేటర్‌ ఉంది. ఈ థియేటర్‌కు 'తమిళనాడు ఒదుక్కపట్ట మావర్‌ పురట్చిపడై' అనే సంఘం పేరిట ఓ లేఖ వచ్చింది. 'తలైవా' (అన్న) విడుదలచేస్తే మీ థియేటర్‌లో బాంబు పేలుతుందని బెదిరించారు. దీంతో థియేటర్‌ యాజమాన్యం మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌దాస్‌ అధ్యక్షతన పోలీసులు ఐనాక్స్‌లో తనిఖీలు చేస్తున్నారు. పోలీసు జాగిలాలతో శోధిస్తున్నారు. దీంతోపాటు మహారాణి, అభిరామి, సత్యం, దేవి, మాయాజాల్‌, భారత్‌, జీవీఆర్‌, ఏజీఎస్‌ థియేటర్లకు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ టైటిల్ రోల్ పోషించిన 'అన్న' చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం 'తలైవా'కు ఇది తెలుగు అనువాద రూపం. అమలా పాల్ నాయిక. విజయ్ తండ్రిగా సత్యరాజ్ నటించారు. ఇదివరకు రవితేజ, వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో 'కృష్ణ' వంటి హిట్ ఫిల్మ్‌ని నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహా విజువల్స్ అధినేత బి. కాశీవిశ్వనాథం ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. సినీ గెలాక్సీ, 3కె ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. రెండు భాషల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వేల థియేటర్లలో విడుదలవుతున్నదని నిర్మాత కాశీవిశ్వనాథం చెప్పారు.

    నిర్మాత మాట్లాడుతూ- ''రజనీకాంత్ 'ఎందిరిన్' చిత్రం 150 కోట్ల రూపాయలు వసూలు చేసి దక్షిణాదిన రికార్డ్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం సృష్టించిన రికార్డ్‌ను అధిగమించే సినిమా 'తలైవా' అవుతుందని విడుదలకు ముందే... తమిళనాట ఓ టాక్. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్లలో విడుదలవుతోందీ సినిమా. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'' అని ఆనందం వ్యక్తం చేశారు.

    వినాయక్ మాట్లాడుతూ "ట్రైలర్ చూశాక కాశీవిశ్వనాథం మంచి సినిమా చేస్తున్నాడని సంతోషం వేసింది. వరదరాజ మొదలియార్ కథతో మణిరత్నం 'నాయకుడు' తీసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మొదలియార్ కొడుకు 'అన్న'గా ఎలా ఎదిగాడో దర్శకుడు విజయ్ ఈ సినిమాలో చూపించారు. తప్పకుండా పెద్ద విజయం సాధించే సినిమా'' అని చెప్పారు. అభిమన్యుసింగ్, సంతానం, రేఖ, రవిప్రకాశ్, వై.జి. మహేంద్ర తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, వనమాలి, రాకేందుమౌళి, సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్, ఛాయాగ్రహణం: నిరవ్ షా. ఈ చిత్రానికి సమర్పణ: సినీ గెలాక్సీ, 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా విజువల్స్

    English summary
    With in few hours from the booking announcement for Vijay's Flick Thalaiva appeared in the newspaper this morning, a bomb threat was sent to city commissioner's office from students out fit. According to our sources, the person in the phone call also said that they would plant bombs in all the theatres where the Flick is scheduled to be released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X