»   » సైతాన్ కా బచ్చా.. సిద్ధార్థ, ఇంకో మూడు

సైతాన్ కా బచ్చా.. సిద్ధార్థ, ఇంకో మూడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్‌. అయితే తెలుగులో ఆయన సినిమాలు ఆడకపోవటంతో ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే తాజాగా ఓ చిత్రం మాత్రం తమిళ ప్రేక్షకుల కోసం చేయటానికి సిద్దమయ్యారు.

సిద్దార్ద...తాజాగా నాలుగు సినిమాల్లో కమిట్‌ అయ్యారు. శశి దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు సంతకం చేశారు. మరోవైపు 'కప్పల్‌' దర్శకుడు కార్తిక్‌ క్రిష్‌ దర్శకత్వంలో 'సైతాన్‌ కా బచ్చా', రతీష్‌ అంబత్‌ దర్శకత్వంలో ఓ సినిమా; తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో తెరకెక్కే మరో చిత్రంలో కూడా సిద్ధార్థ్‌ కమిట్‌ అయ్యారు.

Busy year for Siddharth with 4 films

సిద్దార్ద మాట్లాడుతూ.. ''మంచి చిత్రాల్లో నటించడం కోసం ఇంత కాలం వేచిచూశా. అందుకు తగిన అవకాశాలు వస్తాయనుకున్నా. కాస్త నిరీక్షణ అనంతరం అది నెరవేరింది''అని తెలిపారు.

మూడేళ్లుగా 'ఉదయం..', 'తీయా వేలై సెయ్యనుం కుమారు', 'జిగర్‌దండా', 'కావియ తలైవన్‌'.. వంటి చిత్రాలతో మెప్పించారు. వీటిలో చాలా వరకు సినిమాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. గత ఏడాది 'ఎనక్కుల్‌ ఒరువన్‌'లో మాత్రమే ఆయన నటించారు. కొత్త సినిమాలను ఎంచుకునే విషయంలోనూ ఆచితూచి అడుగులేశారు.

English summary
Actor Siddharth, last seen in Tamil comedy "Jil Jung Juck", has a busy year ahead with four films in his kitty. He hopes his choice of films will satisfy his fans. One of the four projects is Tamil comedy “Saithan Ka Bachha”.“Siddharth will team up with director Karthik of ‘Kappal’ fame in ‘Saithan Ka Bachha’, which will first go on the floors. He also has a Tamil project with director Sasi, and this film will also feature actor composer G.V. Prakash as one of the leads,” a source told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu