»   » మణిశర్మపై చార్జిషీటు దాఖలు

మణిశర్మపై చార్జిషీటు దాఖలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మణిశర్మకు నగరంలో నీలాంగరై సమీపంలోని కానాత్తూరులొ సొంత భూమి ఉంది. ఈయన స్థలానికి పక్కనే సేలం నివాసి కరుప్పన్‌కు చెందిన భూమి ఉంది. తన 75 సెంట్ల భూమిని మణిశర్మ కంచె వేసినట్లు గతంలో కరుప్పన్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ ఆలందూరు కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మణిశర్మపై గత జూన్‌ నెల 27వ తేదీన కోర్టులో చార్జిషీటును దాఖలు చేసినట్లు పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే... ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ..భూ ఆక్రమణ కేసులో ఇరుక్కున్నారు. ఆయనపై తమిళనాడుకి చెందిన కరూర్ కరుప్పన్ అనే వ్యక్తి కేసు వేసారు. నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్ ని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపిస్తారని తెలుస్తోంది.

Chargesheet filed against Mani Sharma


తమిళనాడులోని కణాతూర్ దగ్గర కరూర్ కరుప్పన్ అనే వ్యక్తికి డబ్బై ఐదు సెంట్ల భూమి ఉంది. అయితే తన భూమిపై దర్శకుడు మణిశర్మ హక్కులు కలిగి ఉన్నట్లు కరుప్పన్ కి తెలిసింది. దాంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. భూమికి సంభందించిన పత్రాలు పరిశీలించిన పోలీసులు నకిలీ పత్రాలతో ఆ భూమిపై మణిశర్మ హక్కులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. మేనేజర్ రఘురామన్ పై ఇప్పటికే విచారణ మొదలైంది. రఘురామన్ తెలిపై వివరాలతో మణిశర్మను కూడా పోలీసుల అదుపులోకి తీసుకుంటారని సమాచారం.

English summary
Music director Manisharma facing problems. Police say on cops hunting for mani sharma in Tamil Nadu and Andhra Pradesh. As per a petition filed by Karur Karuppan, 75 cents of his land valued at Rs.10 Crores. illegally encroached by mani sharma producing fake documents. Police have begun their investigation to reveal that documents produced by Mani's manager Raghuraman are completely fake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu