Just In
Don't Miss!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్మాతతో ఇల్లీగల్ కాంటాక్ట్ చూసే, నటి రాధకు డ్రైవర్ బెదిరింపు కాల్స్
చెన్నై : తమిళ నటి రాధ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పోలీసు కమిషనర్ కార్యాలయంలో తనకు ప్రాణహాని వుందని, పోలీసు భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా తనను వైరం అనే రౌడి షీటర్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఆ ఆడియోని సైతం విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పుళల్ జైలులో బందీగా వున్న వైరం అనే రౌడీషీటర్ తనను హత్య చేస్తానని సెల్‌ఫోన్‌లో బెదిరించాడని, సెల్‌ఫోన్ బెదిరింపు ఆడియోను కూడా కమిషనర్ కార్యాలయంలో సమర్పించినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు కథ అసక్తికరమైన మలుపు తిరిగింది. రాధను బెదిరించింది నిర్మాత డ్రైవర్ ఆంటోని రాజ్ అని తేలింది.
'చంపేస్తా' జైల్లో ఉన్న రౌడి బెదిరింపు, పోలీసులతో నటి రాధ, అక్రమ సంభంధమే కారణం?
ఆంటోని రాజ్ (28) ని ఈ కేసులో అరెస్ట్ చేసారు. అతను రాధను..గొంతు మార్చి రౌడీ షీటర్ వైరం లాగ పుజిల్ జైలు నుంచి మాట్లాడుతున్నట్లు బెదరించాడు. అతను నిర్మాత మునివేల్ డ్రైవర్. మునివేల్ తో రాధకి సంభంధం ఉంది.
ఆంటోని రాజ్ ఎందుకు కాల్ చేసాడు అంటే స్లైడ్ షోలో చదవండి

భర్త అక్రమ సంభంధం
తన భర్త అక్రమ సంభంధం గురించి మనిరాజ్ భార్య ఏడవటంతో చూసిన డ్రైవర్...బాధతో ఈ బెదిరింపు కాల్ చేసానంటున్నాడు.

యజమానికి దూరంగా
తను ఇలా రౌడిలా గొంతు మార్చి ఫోన్ చేస్తే...భయపడి తన యజమాని నుంచి ఆమె దూరం అవుతుందని భావించి చేసానని చెప్తున్నాడు

దొరికిపోయాడు
అయితే ఆమె ఆడియోని రికార్డ్ చేసి విడుదల చేయటం, పోలీస్ లు యాక్షన్ లోకి దిగ విచారించటంతో అసలు విషయం బయిటకు వచ్చేసింది.

నంబర్ ని బట్టే
రాధ తనకి కాల్ వచ్చిందని చెప్పబడుతున్న నెంబర్ ని చూసి,అది జైలు నుంచి రాలేదని కనుగొన్నామని చెప్పారు

జైల్లో రైడ్స్
ఈ కేసు విషయమై ఫుజిల్ జైల్లో రైడ్స్ చేసారు. ఆరు ఫోన్స్ సీజ్ చేసారు. ముఖ్యంగా వైరం నుంచి పోన్ కాల్స్ రాలేదని తేల్చారు పోలీసులు

ఆ ఫోన్ ఆందోని రాజ్ కు కూడా కాదు
ఇంతకీ రాధకు వచ్చిన కాల్ గల ఫోన్ నెంబర్ ఆంధోని రాజ్ ది కాదు. నీలకర్ణి అనే ఆవిడ ఫోన్ నుంచి అని తెలిసిందే.

పట్టుకోలేరు
వేరే వారి పోన్ నుంచి ఫోన్ చేస్తే పట్టుకోలేరని ఉద్దేశ్యంతో ఆంధోని రాజ్ వేరే వారి ఫోన్ వాడినట్లు తెలుస్తోంది.

మునివేల్ భార్యే
ఈ ఫోన్ కుట్ర వెనక ఉన్నది నిర్మాత మునివేల్ భార్యదే అని రాధ ఆరోపిస్తోంది.

వైరం భార్య
రౌడి షీటర్ ..వైరం భార్య తమ కంప్లైంట్ లో తన భర్తపై అనవసరంగా నింద మోపారని కంప్లైంట్ ఇచ్చింది

మరో ప్రక్క..
తనను వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర పన్నుతున్నాడంటూ 'సుందరా ట్రావెల్స్'లో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు.

సహజీవనం
'సుందరా ట్రావెల్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. తాను నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు.

వేరే అమ్మాయిలతోనూ..
అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు.