twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులు: వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సింగర్ చిన్మయి

    |

    ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి #మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మైరముత్తులాగే ఇండస్ట్రీలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరికొందరి పేర్లు సైతం ఆమె బయట పెట్టి #మీటూ ఉద్యమాన్ని తమిళనాడులో మరింత బలోపేతం చేశారు.

    ఈ పరిణామాలు చివరకు చిన్మయికి ప్రతికూలంగా మారాయి. వేరే కారణాలు ఏవో చూపి ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి బ్యాన్ చేశారు. గత నాలుగు నెలలుగా ఆమె పనిలేక ఖాళీగా ఉంటోంది. వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మానేసి తమ పొట్టకొట్టే ప్రయత్నాలు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె వైరముత్తు మీద ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేకా గాంధీ సహాయం కోరింది.

    మా సమస్యకు పరిష్కారం చూపండి

    మా సమస్యకు పరిష్కారం చూపండి

    వైరముత్తులాగే ఎంతో మంది ప్రిడేటర్లు(మహిళలను లైంగికంగా వేధించేవారు) ఇండస్ట్రీలో చాలా ఉంది ఉన్నారు. నా లాగే వేధింపులకు గురైన మహిళలు ఉన్నారు. వారి పేర్లు బయట పెడితే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందికి పెడతారనే భయంతో చాలా మంది మహిళలు ముందుకు రావడం లేదని, ఈ విషయంలో సహాయం చేయాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ... ట్విట్టర్ ద్వారా మేనకా గాంధీకి చిన్మయి విన్నవించారు.

    చీర కట్టినా అసభ్యంగా ఫోటోలు తీసి ఆ సైట్లలో పెడుతున్నారు: సింగర్ చిన్మయి చీర కట్టినా అసభ్యంగా ఫోటోలు తీసి ఆ సైట్లలో పెడుతున్నారు: సింగర్ చిన్మయి

    రంగంలోకి మేనకా గాంధీ

    రంగంలోకి మేనకా గాంధీ

    ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే మేనకాగాంధీ.. చిన్మయి ట్వీట్ మీద స్పందించారు. మీ కేసు నేను పరిశీలిస్తాను. మీ కాంటాక్ట్ డిటేల్స్ డైరెక్ట్ ముసేజ్ ద్వారా పంపాలని కోరారు. ఈ కేసు నేషనల్ ఉమెన్ కమీషన్ డీల్ చేస్తుందని ఆమెకు భరోసా ఇచ్చారు.

    వైరముత్తుపై ఫిర్యాదు

    వైరముత్తుపై ఫిర్యాదు

    ఇప్పటి వరకు కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైన సింగర్ చిన్మయి... వైరముత్తు అంశాన్ని నేషనల్ ఉమెన్ కమీషన్ వరకు తీసుకెళ్లడం చర్చనీయాంశం అయింది. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

    విశాల్‌కు లెటర్ రాశం కానీ...

    విశాల్‌కు లెటర్ రాశం కానీ...

    డబ్బింగ్ యూనియన్లో తనపై బ్యాన్ విధించడం, తనకు జరిగిన అన్యాయంపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్‌కు లేఖ రాశామని, అయితే డబ్బింగ్ యూనియన్ వ్యవహారం కావడంతో వారు జోక్యం చేసుకోలేక పోయారని చిన్మయి తెలిపారు.

    కోర్టులో చూసుకుందాం

    కోర్టులో చూసుకుందాం

    తనపై బ్యాన్ విధించడంపై డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవి రాబోయే రోజుల్లో కోర్టు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా చిన్మయి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    English summary
    Singer Chinmayi Sripaada has registered a complaint against Vairamuthu after she was banned from the dubbing union of the Tamil Nadu film industry. Union minister Maneka Gandhi has assured to help her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X