తమిళ హాస్య నటుడు చిట్టిబాబు మృతి
చెన్నై: తమిళ హాస్య నటుడు చిట్టిబాబు మరణించారు. గత కొంతకాలంగా డయాబెటిస్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన కొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం కోమాలోకి వెళ్లారు. శుక్రవారం ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
చిట్టి బాబు వయసు (49). ఆయన అసలు పేరు సజాద్ అదీబ్. డయాబెటిస్ కారణంగా ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కొంత కాలం క్రితం ఆయనకు గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సర్జరీ తర్వాతి నుండి ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. సర్జరీకితోడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.

టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ మొదలు పెట్టిన చిట్టిబాబు 2002లో 'ఫైవ్ స్టార్' అనే సినిమాతో వెండితెరపై కెరీర్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన 20కి పైగా చిత్రాల్లో నటించారు. చిట్టి బాబు మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తమిళ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.


Click it and Unblock the Notifications











