twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Santhanam ప్రముఖ కమెడియన్ కుటుంబంలో దారుణ హత్య.. నలుగురి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

    |

    తమిళ నటుడు, కమెడియన్ సంతానం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. తన ఫ్యామిలీలో సభ్యురాలు, సమీప బంధువు జయభారతీ అనే మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తీవ్ర విషాదంలో మునిగిన సంతానం కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తూ అండగా నిలిచారు. ఈ హత్యకేసు వివరాల్లోకి వెళితే...

    సంతానం సమీప బంధువు గురించి

    సంతానం సమీప బంధువు గురించి

    సంతానం సమీప బంధువు జయభారతి తిరువరూర్ జిల్లాకు చెందిన వారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష్ణు ప్రకాశ్‌తో వివాహం జరిగింది. అనంతరం తమిళనాడులోనే సెటిల్ అయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయారు. కొంతకాలంగా జయభారతీ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.

    గృహ హింస, వేధింపులు, బెదిరింపులు

    గృహ హింస, వేధింపులు, బెదిరింపులు

    అయితే ఇలాంటి కలహాల మధ్య విష్ణు ప్రకాశ్‌తో విడాకులు ఇప్పించాలని జయభారతి ఇటీవల కేసు నమోదు చేశారు. గృహ హింస, బెదిరింపులు, వేధింపుల కారణాలు చూపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో విష్ణుకు తన కంపెనీ నుంచి సమస్యలు ఎదురయ్యాయి. దాంతో పిటిషన్ విత్ డ్రా చేసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విష్ణు ప్రకాశ్ హెచ్చరించారు.

    వ్యాన్‌తో ఢీకొట్టి దారుణ హత్య

    వ్యాన్‌తో ఢీకొట్టి దారుణ హత్య


    ఇలాంటి పరిణామాల మధ్య ఒక రోజు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న జయభారతీ ఇంటికి వస్తున్న సమయంలో బ్యాంకులకు క్యాష్ తీసుకెళ్లే వ్యాన్ ఒకటి ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో కిరాయి హంతకులను ఉపయోగించి విష్ణు ప్రకాశ్ హత్య చేయించి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    పోలీసులకు సంతానం ఫిర్యాదు

    పోలీసులకు సంతానం ఫిర్యాదు

    జయభారతీ మరణం వెనుక అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం కావడంతో నటుడు సంతానం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో తిరువల్లూరు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారు విష్ణు ప్రకాశ్ సూచన మేరకు తాము హత్య చేశామని నేరాన్ని ఒప్పుకొన్నారు. మొదట స్కూటీని చెట్టు ఢీకొట్టేలా చేశాం. ఆ తర్వాత వ్యాన్‌ను ఆమెపైకి ఎక్కించామని నేరాన్ని అంగీకరించారు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
    యూఎస్ ఎంబసీకి కంప్లైంట్

    యూఎస్ ఎంబసీకి కంప్లైంట్

    జయభారతీ హత్య కేసులో నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత అనేక మలుపు తిరిగింది. విష్ణు ప్రకాశ్ సోదరుడు సెంథిల్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కారు డ్రైవర్ ప్రసన్న, ఇంకా అతడి అనుచరులు రాజా, జగన్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విష్ణు ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని యూఎస్ ఎంబసీకి సంతానం కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు.

    English summary
    Kollywood comedian Santhanam's close relative Jayabharathi brutally murdered in Thiruvallur. After Jayabharathi death many of her family members raised doubts where she died in mysterious circumstances. Santhanam also complait for detail investigation in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X