»   » కుట్ర జరిగింది: అయినా ‘బాహుబలి’ని దాటేసాడు!

కుట్ర జరిగింది: అయినా ‘బాహుబలి’ని దాటేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడులో హీరో విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తేరి'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గురువారం అర్థరాత్రి విడుదల చేసారు. టీజర్ ఇలా రిలీజ్ అయిందో లేదు....అలా రికార్డులు కుమ్మేసింది.

టీజర్ విడుదలైన 10 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. మరో వైపు ఈ రోజు అర్థరాత్రి దాటే లోపు 2 మిలియన్ మార్కును అందుకునేలా ఉంది. అయితే ఓ విషయంలో మాత్రం విజయ్ బాహుబలిని దాటేసాడు. బాహుబలి టీజర్ లైఫ్ టైంలో కేవలం 35వేల లైక్స్ మాత్రమే సాధించింది. కానీ ‘తేరి' టీజర్ కు ఒక రోజు కూడా గడవక ముందే లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక బాహుబలి వ్యూస్ రికార్డును కూడా త్వరలోనే దాటేసే అవకాశం ఉంది.

అయితే...టీజర్ రిలీజ్ కాకుండా కొందరు కుట్ర చేసారని...‘తేరి' చిత్ర నిర్మాత కలైపులి థాను, దర్శకుడు అట్లీ ఆరోపించారు. వారి కుట్రను చేధించి మరీ ట్రైలర్ రిలీజ్ చేసినట్లు వారు చెప్పుకొచ్చారు. మరో వైపు టీజర్ అభిమానులను బీభత్సంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ స్టైల్ అదిరిందని అంటున్నారంతా.

‘తేరి' చిత్రం వివరాల్లోకి వెళితే... విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Read more about: vijay, theri, విజయ్, తేరి
English summary
Theri director Atlee and producer Thaanu says that some body have 'played' to stop the teaser of the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu