»   » హీరోల కోసం రోజుకొకరి తప్పనిసరి చావు

హీరోల కోసం రోజుకొకరి తప్పనిసరి చావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ అభిమాన హీరోల కోసం దేశంలో ప్రతిరోజూ కనీసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని, ఈ జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని జాతీయ నేర నమోదు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. సిద్ధాంతాలు కోసం లేదా, తమ అభిమాన హీరోలపై ఆరాధనే వారిని ఆత్మహత్యల వైపుకు ఉసిగొల్పుతోందని ఆ నివేదిక వెళ్ళడించింది. 2008లో జరిగిన 1,25,017 మరణాలలో ఈ ఆత్మహత్యలు 392 అయినప్పటికీ, 2007తో పోల్చితే 50 శాతం పెరిగిందని పేర్కొంది. 2007లో ఈ కారణలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 261 కాగా, 2006లో 289 మంది. '2008లో భారత్‌లో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు' నివేదికలో ఎన్‌సీఆర్‌బీ ఈ వివరాలను తెలిపింది. అయితే ఇంతలా అమాయక అభిమానుల ఆత్మహత్యలు ఆపటానికి హీరోలు ఎక్కడా తమ మాటల ద్వారా గాని, మీడియా ద్వారా గాని, సినిమాల ద్వారా కాని ప్రయత్నించకపోవటం విషాదం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu