twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోట్లు కట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు,జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటూ...స్టార్ హీరో

    By Srikanya
    |

    చెన్నై: బ్యాంకులు కాలం తీరిపోయిన 500, 1000 రూపాలయల నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం ప్రారంభించాయి. ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయంతో రెండు రోజులుగా 500, 1000 రూపాయల నోట్లు తప్ప వేరే కరెన్సీ నోట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులు ముందుగా బ్యాంకులకు పరిగెత్తుతున్నారు. బ్యాంకులు కూడా రద్దీని ఊహించి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నా పెద్దగా ఫలితం కనిపించటం లేదు. ఈ విషయమై సినీ సెలబ్రెటీలు ఇప్పటికే చాలా పాజిటివ్ గా స్పందించారు. ఈ విషయమై తమిళ హీరో విజయ్ సైతం స్పందించారు.

    విజయ్ మాట్లాడుతూ... ఇరవై శాతంమంది కారణంగా 80శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మీడియా ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రజలు నేడు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

    అలాగే విజయ్ కంటిన్యూ చేస్తూ... 'సాధారణ పౌరులే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 20శాతం మంది కారణంగా 80శాతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు' అంటూ విజయ్ అన్నారు.

    Demonetisation welcome, but common man affected: Actor Vijay

    ప్రస్తుత ఆయన బైరవ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం విశేషాలకు వస్తే.. విజయ ప్రొడక్షన్స్- బి. వెంకటరామిరెడ్డి సంయుక్తంగా సమర్పిస్తున్న తమిళ మూవీ భైరవ. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.. విజయ్ కెరీర్‌లో 60వ సినిమాగా తెరకెక్కుతున్న భైరవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

    తాజాగా విడుదలైన టీజర్ మూవీపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్, అపర్ణ వినోద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు విలన్‌గా కనిపించనున్నారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

    భరహాతన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ టీజర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ఒక్క రోజులోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.ఈ టీజర్ లో నువ్వేమైనా కలెక్షన్‌ కింగా? అని విలన్‌ అడగ్గా.. అవును బయట అలాగే మాట్లాడుకుంటున్నారు అని విజయ్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Leading Tamil film star Vijay today termed the Centre's move to demonetise high-value currency notes as "courageous", but said the hardships faced by the common man post the announcement could have been averted if proper measures had been put in place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X