»   » ధనుష్ ..ఇదేం పిచ్చి ఆలోచన?

ధనుష్ ..ఇదేం పిచ్చి ఆలోచన?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయటం కొత్తేమి కాదు..వింత అసలు కాదు. అయితే ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్స్ చేస్తారా... చేస్తానంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఆ మధ్యన ధనుష్ హీరోగా వచ్చి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందిన ‘మారి'సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామంటున్నారు.

బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ధనుష్‌ చెన్నై యువకుడిగా నటించిన చిత్రం ‘మారి'. రొటీన్‌ పాత్రలకు భిన్నంగా మాస్‌ కుర్రాడిగా గెటప్‌ను మార్చి.. ఈ సినిమాలో నటించారు ధనుష్‌. ఇందులో ఆయన సరసన కాజల్‌ నటించింది.

Dhanush’s ‘Maari’ sequel on cards

పావురాల పందెం కథతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ‘మారి' చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. ఈ సారి అదిరిపోయే కథ తో వస్తున్నామంటున్నారు.

ప్రస్తుతం ధనుష్‌ దురైసెంధిల్‌ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఓ హాలీవుడ్‌ సినిమాలోనూ నటించనున్నారు. ఇటీవల ‘మారి 2' సీక్వెల్‌కు కథను సిద్ధం చేశారు బాలాజీ మోహన్‌. అక్టోబరు నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాల సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

English summary
The sequel to Dhanush-starrer Tamil entertainer “Maari”, which released last year in cinemas, is in the pipeline and will go on the floors later this year, a source said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu