For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానాకి ధాంక్స్ చెప్పిన ధనుష్‌

  By Srikanya
  |

  చెన్నై: తెలుగు హీరో దగ్గుబాటి రానా చెన్నై వరద బాధితుల కోసం రామానాయుడు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆందిస్తున్న సేవలను తమిళ నటుడు ధనుష్‌ అభినందించారు. హైదరాబాద్‌ నుంచి రానా, ఇతర తెలుగు నటీనటులు పంపించిన ఆహారం, ఇతర పదార్థాలు చెన్నై ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ధనుష్‌ తెలిపారు


  .

  ఈ సందర్భంగా ధనుష్‌ తన ఫేస్‌బుక్‌ , ట్విట్టర్ ఖాతా ల ద్వారా హైదరాబాద్‌ నుంచి పంపించిన సరుకులను దింపుతున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ రానాకి కృతజ్ఞతలు తెలిపారు.

  రామానాయుడు స్టూడియోలో సహాయక కేంద్రం చెన్నైలోని వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ఓ సహాయక కేంద్రాన్ని రామా నాయుడు స్టూడియోలో ఏర్పాటు చేశారు. రానా పర్యవేక్షణలో ఈ కేంద్రం నుంచి సహా యక చర్యలు జరుగుతున్నాయి. ఎవరైన ఎటువంటి సహాయమైన చేయదలిస్తే ఈ కేంద్రాన్ని సంప్రదించవచ్చని రానా అన్నారు.

  Dhanush thanks to Daggupati Rana

  భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైని, చెన్నై ప్రజలను ఆదుకునేందుకు తారాలోకం ఆపన్న హస్తం అందిస్తోంది. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, వైద్యం, మందులు తదితర వాటిని ఇతోధికంగా అందిస్తూ మరికొంతమందికి తారాలోకం ఆదర్శంగా నిలిచింది. క్షణ క్షణం విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ భారీ వర్షాల ధాటికి తమిళనాడే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలు అస్తవ్యస్థమయ్యాయి.

  నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఏకంగా కోటి రూపా యలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటి వరకు చెన్నై వరద బాధితులకు ఆర్థిక సాయం అందించిన తారల్లో అత్యధికంగా విరాళం ప్రకటించిన ఘనత లారెన్స్‌కే దక్కుతుంది. ఆయన ఇప్పటికే ఒక ఛారిటీని స్థాపించి పలు సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కోటి రూపాయల మొత్తాన్ని తన ఛారిటీ ద్వారా అందించనున్నారు.

  కృష్ణంరాజు, ప్రభాస్‌ 15 లక్షల ఆర్థిక సాయం ఈ క్రమంలో తాజాగా కృష్ణంరాజు, ప్రభాస్‌ తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. చెన్నై వరద బాధితులకు కృష్ణంరాజు, ప్రభాస్‌ సంయుక్తంగా 15లక్షలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాధితులకు ప్రభాస్‌ ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

  చెన్నై వరద బాధితుల సహాయార్థం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు మైత్రి మూవీస్‌ సంస్థ అధినేతలు ప్రకటించారు. 'చెన్నై మహానగరంతో మా మైత్రీ మూవీస్‌ టీమ్‌కి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అటువంటి చెన్నై ఇవాళ భారీ వర్షాల కారణంగా నీట మునగడం విచారకరం. మా సంస్థ తరపున ఐదు లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్య మంత్రి రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నాం. చెన్నై ప్రజలకు మనమంతా అండగా నిలవాల్సిన సమయమిది' అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) తెలిపారు.

  తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేందుకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముందుకొచ్చారు. తమిళనాడు లోని లిటిల్‌ ఫ్లవర్‌ అంధుల పాఠశాలలోని చిన్నా రులకు ఇళయరాజా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. వెళ్ళేందుకు వీలుకాని ప్రమాదకర పరిస్థితి ల్లోనూ ఇళయరాజా చిన్నారుల చెంతకు చేరుకుని ఆహార పదార్థాలను అందించడం గొప్ప విషయం.

  విశాల్‌, సిద్ధార్థ్‌ 'చెన్నై మహానగరం వరదల్లో మునిగిపోతుంటే చూస్తూ ఇండలేను. ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటికి వస్తున్నాను' అని హీరో విశాల్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వరద బాధితులను ఆదుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి వివరాలను సైన్యానికి అందజేస్తూ, ఆహారం, మందులు, వసతి తదితర ఏర్పాట్లను మరో హీరో సిద్ధార్థ్‌ పర్యవేక్షిస్తున్నారు.

  English summary
  Dhanush tweeted:" Thanks RanaDaggubati for your supplies. Great contribution ". Several actors from the southern film industry such as Rana Daggubati, Dhanush, Allari Naresh and Siddharth have done their bit to help the people of flood-hit Tamil Nadu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X