Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
మెగాస్టార్లు, సూపర్‌స్టార్లతో పనిచేశా.. విజయ్ లాంటి హీరోను చూడలేదు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తొలిసారి తమిళ సినీ రంగంలోకి ప్రవేశించి నిర్మించిన చిత్రం వారిసు. తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కోలివుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. వారిసు సినిమాను జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా రిలీజ్‌కు చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

ఏపీలో థియేటర్ల వివాదం
దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు చిత్రానికి సంబంధించి థియేటర్ల వివాదం టాలీవుడ్‌లో గట్టిగానే నడుస్తున్నది. వారిసుతోపాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డితోపాటు అజిత్ నటించిన తెగింపు చిత్రం కూడా విడుదల అవుతున్నాయి. అయితే బాలయ్య, చిరంజీవి సినిమాలకు థియేటర్లు ఇవ్వమనని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యానించడం సెన్సేషనల్‌గా మారింది.

నా థియేటర్లు వారికి ఇవ్వను
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో పలు థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉన్నాయి. నా సినిమాను వదిలేసి ఇతర హీరోల సినిమాలకు నా థియేటర్లు ఇచ్చేది లేదు. ఇంత వరకు మైత్రీ వాళ్లు నాతో చర్చలకు కూడా రాలేదు. దిల్ రాజు అంటే ఏమిటో సినీ వర్గాలకు తెలుస్తుందంటూ ఘాటుగా దిల్ రాజు స్పందించారు.

వారిసు ఆడియో ఫంక్షన్‌లో
ఒక పక్క ఏపీ, తెలంగాణలో థియేటర్ల వ్యవహారం, వివాదం జోరుగా కొనసాగుతుండగానే.. దిల్ రాజు చెన్నైలో వారిసు ఆడియో లాంచ్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది తరలివచ్చారు. స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
|
మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అంటూ
వారిసు ఆడియో లాంచ్ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. దళపతి విజయ్ సార్ కోసం ఆయన క్యాబిన్‌లో వెయిట్ చేస్తున్నాను. ఆయన డోర్ తీసుకొని లోపలికి వచ్చి.. రెండు కాఫీ కప్పులతో వచ్చి నాకు కాఫీ ఇచ్చారు. ఇక స్టార్ హీరో వ్యవహరించిన తీరు నాకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికీ ఆ సన్నివేశం నా మైండ్‌లో ఉంది. అయితే నేను తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్లు, సూపర్‌స్టార్లతో పనిచేశాను. కానీ ఇలాంటి అనుభవం కానీ, విజయ్ లాంటి హీరోను చూడలేదు అని దిల్ రాజు అన్నారు.
|
సంక్రాంతికి హిట్ వారిసు మాత్రమే అంటూ
దిల్ రాజు జోష్‌తో మాట్లాడుతూ.. విజయ్ సూపర్ స్టార్.. నంబర్‌వన్.. నంబర్‌వన్.. నంబర్‌వన్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా సంక్రాంతికి బిగ్ బ్లాక్‌బస్టర్. తమిళంలోనే కాదు. తెలుగు, ఉత్తరాదిలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని రాసిపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన డ్యాన్సులు, డైలాగ్స్, అన్నీ విజయ్ నుంచి అందించబోతున్నాం అని దిల్ రాజు అన్నారు.