»   » పగులుతోన్న పాపాల పుట్ట: నటున్ని హత్య చేయించాడా?? హీరో మెడచుట్టూ కేసులు

పగులుతోన్న పాపాల పుట్ట: నటున్ని హత్య చేయించాడా?? హీరో మెడచుట్టూ కేసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేరళలో సంచలనం సృష్టించిన నటుడు దిలీప్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. దక్షిణాది నటి పైన ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన దౌర్జన్యం, అఘాయిత్యం, అసభ్య ప్రవర్తన కేసులో దిలీప్ అరెస్టయ్యాడు. దిలీప్ పైన సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసుతోను సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు కళాభవన్ మణి సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు.

మణి మృతి వెనుక దిలీప్‌ హస్తం

మణి మృతి వెనుక దిలీప్‌ హస్తం

విలక్షణ నటుడు కళాభవన్‌ మణి మృతి వెనుక దిలీప్‌ హస్తంపై కళాభవన్‌ మణి సోదరుడు రామకృష్ణన్‌ ఒక టీవీషోలో అనుమానం వ్యక్తం చేశారు. దిలీప్‌ పై నేరుగా ఆరోపణ చేయనప్పటికీ.. ఇద్దరికీ మధ్య భూతగాదాలు ఉన్నాయని, దీనిపై సీబీఐకి సమాచారం అందించానని, సీబీఐ ఆ కేసులో దర్యాప్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే మలయాళ దర్శకుడు బైజు కొట్టక్కర కూడా కళాభవన్‌ మణి మృతి వెనుక దిలీప్‌ హస్తంపై అనుమానం వ్యక్తం చేశారు.

Actress Bhavana Got Engaged : Why She Got Secret Engagement
కోజికోడ్‌కి చెందిన మహిళ

కోజికోడ్‌కి చెందిన మహిళ

ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐకి తెలిపినట్లు సమాచారం. దీని గురించి కోజికోడ్‌కి చెందిన ఓ మహిళ తనకు ఫోన్‌ చేసి చెప్పిందని భూముల విషయంలో మణికి, దిలీప్‌కి గొడవ జరిగిందని బైజు సీబీఐకి వివరించారు. ఈ కేసు విషయంలోనూ దిలీప్‌ను విచారించాల్సిందిగా కోరారు. నటి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని సహా ఆరుగురినిపోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసు విషయంలో దిలీప్‌ తల్లి సరోజమ్మ పిళ్లాయ్‌ని విచారిస్తున్నారు.

మణి అనుమానాస్పద మృతి

మణి అనుమానాస్పద మృతి

ఉత్తగానే తాము ఆరోపణలు చేయటం లేదని.. తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. మణి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారిస్తోంది. తాజాగా.. సీబీఐ అధికారులకు మణి సోదరుడు కొంత సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భూముల విషయంలో మణికి.. దిలీప్ కి గొడవ జరిగిందని.. అదే చివరకూ అతని మరణానికి దారి తీసినట్లుగా చెబుతున్నారు.

మణి మరణం

మణి మరణం

రీల్ లైఫ్ లో విలన్ వేషాలు వేసే మణి మరణం.. అదే రీల్ లైఫ్ లో హీరో పాత్రలు పోషించే దిలీప్ రియల్ గా హత్య చేయించారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఆరోపణలపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

English summary
Dileep, who is already in police custody for his alleged hand in the Malayalam actress abduction case, is now being linked to actor Kalabhavan Mani's death too. The late actor's family and director Baiju Kottarakkara claim that Dileep is involved in Mani's death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu