»   » పట్టుబడ్డ స్టార్ సినీ ప్రొడ్యూసర్, ఐదేళ్ల జైలు శిక్ష

పట్టుబడ్డ స్టార్ సినీ ప్రొడ్యూసర్, ఐదేళ్ల జైలు శిక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'ఊమై విళిగల్‌', 'సింధూరపూవె', 'కరుప్పు రోజా', 'కావ్య తలైవన్', 'ఇనైంద కైగళ్‌' వంటి భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత అబావానన. ఆయన చిత్రాలు చాలా వరకూ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి. అయితే ఆయన ఇప్పుడు బ్యాంక్ స్కామ్ లో దొరికిపోయారు. ఆయన చేసిన నేరాలు సీబీఐ కోర్టులో ప్రూవ్ అయ్యి శిక్ష పడ్డాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. . బ్యాంక్‌ అధికారులతో కుమ్మక్కై చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో సీనియర్‌ నిర్మాత అబావాననకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రూ2.40 కోట్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.

Director Abavanan gets 5-yr jail for cheating bank

అలాగే ఈ కేసులో ఇద్దరు బ్యాంక్‌ అధికారులకు చెరో మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున అపరాధం విధించింది. 1999వ సంవత్సరంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెక్కుల రాయితీ అవినీతిపై చెన్నై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసింది.

English summary
A CBI court on Tuesday sentenced Tamil movie producer Abavanan for five years rigorous imprisonment for cheating a bank, the agency said. In a statement, the Central Bureau of Investigation (CBI) said the court also sentenced two officials of Punjab National Bank (PNB) – K.Rajagopalan and T.S.Ramanujam – to undergo three years rigorous imprisonment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu