twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '24'కథ ఇదేనంటూ... డైరక్టర్ విక్రమ్ కుమార్

    By Srikanya
    |

    చెన్నై: 2016లో మోస్ట్ ఎవేటెడ్ మూవీగా వస్తోన్న" 24" సినిమా కోసం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఆత్రుతగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాని శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ సినిమాస్ సమర్పణలో సూర్య హీరోగా "మనం" ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

    సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా రీసెంట్ గా ఆవిష్కరించారు. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ టీజర్ ని చూసినవారంతా ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా అని అంచనాలలో పడ్డారు. అయితే వీరి ఊహలకు బ్రేక్ వేస్తూ...దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడారు.

    Director about the Story Of Suriya's '24'

    విక్రమ్ కుమార్ మాట్లాడుతూ... " 24" చిత్రం కాన్సెప్టు ట్రైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుంది. అలాగే రెండు కాలాల మధ్య కథగా జరుగుతుంది. ప్రస్తుత కాలానికి సంభందించిన సీన్స్ ని చెన్నైలో షూట్ చేసాం. 25 సంవత్సరాల తర్వాత జరిగే సన్నివేశాలను మాత్రం పోలెండ్ లో చిత్రీకరించాం. ఇక గతానికి సంభందించిన కొన్ని సన్నివేశాలను మాత్రం ముంబైలోని సెట్ లో షూట్ చేసామని చెప్పారు.

    ఇక ఇదే జానర్ లో వచ్చే మిగతా సినిమాలకూ ఈ సినిమాకు అసలు పోలిక లేదని విక్రమ్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎఆర్ రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేపనిలో ఉన్నారని, త్వరలో ఆడియోని విడుదల చేస్తామని అన్నారు. ఏప్రియల్ లో సినిమాని రిలీజ్ చేయటం కోసం యీనిట్ మొత్తం రాత్రింబవళ్లూ కష్టపడుతోందని అన్నారు.

    కథా, కథనాలతోపాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కుతోన్న 24 మూవీ ఆడియెన్స్‌కు ఓ సరికొత్త థ్రిల్‌ను అందిస్తుందని... తిరు, ఎ.ఆర్ రెహ్మాన్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలయికలో విక్రమ్ కుమార్ విజువల్ వండర్‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపాడు.

    టీజర్‌ని విడుదల చేసిన కొన్ని గంటల్లోనె 10 లక్షలకు పైగా వ్యూస్ రావటం ఈ సినిమాకున్న క్రేజుకు నిదర్శనమని అంటున్నాడు జ్ఞానవేల్. సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించాడు.

    సూర్య ,సమంత, నిత్యమీనన్, అజయ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రఫీ: తిరు,కిరణ్ డెహాన్స్.., కూర్పు: ప్రవీణ్ పూడి. నిర్మాత : సునీల్ నారంగ్, రచన- దర్శకత్వం: విక్రమ్ కుమార్.

    English summary
    Director Vikram Kumar has opened up about the 24 film's one-liner. Confirming that 24 delves into the concept of time travel, He has revealed that the film has been set against two time zones.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X