నేనైతే రేప్ చేసేవాడిని.. డైరెక్టర్ వ్యాఖ్యలపై హీరో సీరియస్.. అలాంటి మాటలా సిగ్గు.. సిగ్గు!

By Rajababu

Recommended Video

మమ్ముట్టి పై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్

సినీ వేడుకల్లో ప్రముఖులు ఒక్కొక్కప్పుడు ఉద్వేగంతో మాట్లాడుతూ తప్పులో కాలేస్తుంటారు. తాము ఏం మాట్లాడామనే విషయం తెలుసుకొనే లోపే జరుగాల్సిన రచ్చ జరిగిపోతుంది. తాజాగా అలాంటి అనుభవమే దర్శకుడు మిస్కిన్ ఎదురైంది. ఇటీవల చెన్నైలో జరిగిన పెరంబు చిత్ర ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీ రాజా, కేఎస్ రవికుమార్, కరు పళనియప్పన్ తమిళ పరిశ్రమలోని ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

హద్దు మీరిన మిస్కిన్

హద్దు మీరిన మిస్కిన్

పెరంబు ఆడియో వేడుకలో దర్శకుడు మిస్కిన్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అయితే ఓ దశలో రేప్ జోక్ హద్దు మీరడంతో ఆయన ప్రసంగంపై అందరూ తప్పుపట్టారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు మమ్ముట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మమ్ముట్టిని రేప్ చేసేవాడిని

మమ్ముట్టిని రేప్ చేసేవాడిని

మమ్ముట్టిని ఉద్దేశించి మిస్కిన్ మాట్లాడుతూ... నేను యువకుడిగా ఉండి.. ఆయన అమ్మాయి అయితే నేను లవ్‌లో పడి ఉండే వాడినేమో. ఒకవేళ నేను అమ్మాయినైనా మమ్ముట్టిని రేప్ చేసి ఉండేవాడినేమో అని అన్నాడు.

కంగుతిన్న ప్రముఖులు

కంగుతిన్న ప్రముఖులు

మిస్కిన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో హద్దు మీరడంతో సినీ ప్రముఖులు కంగు తిన్నారు. పబ్లిక్‌గా ఎలా రెచ్చిపోతారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. డిటెక్టివ్ లాంటి హిట్‌తో దూసుకెళ్తున్న మిస్కిన్ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

మిస్కిన్ మాటలు సిగ్గుచేటని

మిస్కిన్ మాటలు సిగ్గుచేటని

మిస్కిన్ వ్యాఖ్యలపై యాక్టర్ ప్రసన్న తీవ్రంగా స్పందించారు. మిస్కిన్ నాకు మంచి స్నేహితుడు. మహిళలపై, తమిళ యాక్టర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆయన మాటలను చూసి నవ్వుకోవడం, సానుభూతి చూపడం తప్ప మరొకటి చేయలేం అని ప్రసన్న పేర్కొన్నారు. పబ్లిక్ వేడుకలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X