Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిన్న పిల్లాడితో నయన లిప్ లాక్, వివాదంపై దర్శకుడు వివరణ
చెన్నై: నయనతార మళ్లీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఓ చిన్న పిల్లాడుకి ఇచ్చిన ఓ లిప్ లాక్ గురించి , చెన్నై పరిశ్రమ మొత్తం ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా నయనతార, జీవా కాంబినేషన్ లో తెరకెక్కి,రిలీజ్ అయిన తిరునాల్ చిత్రంలోది. వాస్తవానికి ఈ సీన్ వల్గర్ గా లేకపోయినా, ఇలాంటి సీన్స్ వల్ల తప్పుడు సంకేతాలు చిన్న పిల్లల్లోకి పంపుతున్నారని, ఇది చైల్డ్ రైట్స్ కు విరుద్దం అంటున్నారు.
మీడియాలో కూడా ఇదే విషయం చర్చనీయాంశమైంది. అందరూ సెన్సార్ ని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా దర్శకుడు చీఫ్ టేస్ట్ కు ఇది నిదర్శనం అని, నయనతార కూడా ఇలాంటి సన్నివేశాలు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు రామనాధన్ వన్ ఇండియాతో మాట్లాడాడు.
దర్శకుడు మాట్లాడుతూ.." మొదట మీరు గమనించాల్సింది..ఈ సీన్ లో మీరు ఆ చిన్నపిల్లాడి అమాయకత్వం. అలాగే సెన్సార్ బోర్డ్ లో కూడా ఈ సీన్ పాసైంది. అక్కడ ఓ కట్ కూడా చెప్పలేదు. అంతేకాకుండా మేము క్లైమాక్స్ లో ఓ మంచి మెసేజ్ చెప్పాం. దాన్ని మీరు పట్టించుకోవటం లేదు. ఈ విషయం పైనై దృష్టి పెడుతున్నారు కానీ సినిమాలో ఉన్న ఎన్నో మంచి విషయాలను మీరు వదిలేస్తున్నారు. నిజంగా అది అభ్యంతరకరమైన సన్నివేశం అయితే నయనతార ఎందుకు చేస్తుంది..ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించటం లేదు," అన్నారు.

అలాగే.." ఈ మధ్యకాలంలో సినిమాలో కనిపించే ప్రతీ విషయాన్ని క్రిటిసైజ్ చేయటం కొంతమందికి అలవాటుగా మారింది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి గా చేసి చూపెడుతున్నారు. మేం తప్పుడు సీన్ ని తీయలేదని ఇప్పటికీ చెప్తున్నా," అన్నాడు దర్శకుడు.
అయితే సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో టీమ్ ఈ కాంట్రవర్శీ తమ సినిమా పబ్లిసిటీ కు పనికొచ్చే అవకాసం ఉందన్నట్లుగా సైలెంట్ గా చూస్తున్నారు. కానీ దర్శకుడు చీప్ టేస్ట్ కు ఇది నిదర్శనం అని, నయనతార అయినా ఇలాంటి సీన్ చేయనని అడ్డు చెప్పవచ్చు కదా, అలాంటిది చేయని నయనతార కూడా ఇందులో తప్పు ఉందని అంటున్నారు.