Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కాజల్ అశ్లీల సన్నివేశంపై దుమారం.. డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా!
కాజల్ అగర్వాల్ తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్యారిస్ ప్యారిస్. ఈ చిత్రం హిందీ బ్లాక్ బస్టర్ మూవీ క్వీన్ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కుతోంది. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గాను కంగనా రనౌత్ పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ చిత్రాన్ని మనుకుమారన్ అనే నిర్మాత సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ భాషలకు వేరువేరు హీరోయిన్లని, వేరు వేరు దర్శకులని ఎంపిక చేసుకుని రూపొందిస్తున్నారు. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

అశ్లీల సన్నివేశం తీవ్ర వివాదంగా
కాజల్ అగర్వాల్ నటిస్తున్న ప్యారిస్ ప్యారిస్ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకుడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ తన ఊరి నుంచి ప్యారిస్ కు ఒంటరిగా హానీ మూన్ కు వెళ్లే యువతిగా నటిస్తోంది. చాలా చిత్రాల్లో కాజల్ గ్లామర్ పాత్రలు చేసింది. కానీ ఈ చిత్రం పూర్తిగా నటనపై ఆధారపడి ఉండే చిత్రం. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ అందులో ఓ సన్నివేశం మాత్రం తీవ్ర వివాదంగా మారింది.

నెటిజన్ల విమర్శలు
టీజర్ లో చూపిన విధంగా కాజల్ అగర్వాల్ పక్కనే ఉన్న యువతీ ఆమె ప్రైవేట్ భాగాలపై చేయి వేస్తుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాజల్ పై విమర్శలు చెలరేగాయి. కాజల్ ఎంతగా అందాలు ఆరబోసినా ఎప్పుడూ హద్దులు దాటలేదు.. వల్గర్ గా నటించలేదు. కానీ ఈ సన్నివేశం చూసాక కాజల్ అభిమానులే ఫీల్ అవుతున్నారు. ఈ వివాదంపై కాజల్ అగర్వాల్ స్పందించలేదు కానీ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ స్పందించాడు.
Poll: ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు 2018
టీజర్ మాత్రమే చూసి
కేవలం టీజర్ మాత్రమే చూసి సినిమాపై విమర్శలు చేయడం సరికాదు అంటూ దర్శకుడు ఆ సన్నివేశాన్ని సమర్థించుకున్నారు. సినిమాలో అంతకు ముందు వచ్చే సన్నివేశం చూస్తే ఆ సీన్ ఎందుకు పెట్టామో మీకు అర్థం అవుతుంది. ఇలాంటి సన్నివేశం హిందీ క్వీన్ లో కూడా ఉంది. ఆ చిత్రం జాతీయ అవార్డు సొంతం చేసుకుందని తెలిపారు.

బిజీగా కాజల్
కాజల్ ఇప్పటికి సౌత్ లో బిజీ స్టార్ గా కొనసాగుతోంది. తెలుగులో తేజ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సీత అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో నటిస్తుండగా కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ఇండియన్ 2లో అవకాశం దక్కించుకుంది.