For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్‌ చేసిన పొరపాటు,సీరియస్ అయిన దర్శకుడు

  By Srikanya
  |

  చెన్నై: కొన్ని సంఘటనలు జరిగాక నాలుక కరుచుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు కాజల్ అదే పని చేసింది. కానీ ఆమెకు అప్పటికే దర్శకుడు చేత అక్షింతలు పడిపోయాయి. అంత స్టార్ హీరోయిన్ పై కోపం తెచ్చుకునేటంత దర్సకుడు ఎవరా అంటారా తమిళ దర్శకుడు శివ.

  అఫ్ కోర్స్ ఆయన తెలుగులో కూడా రవితేజతో దరువు, గోపీచంద్ తో శౌర్యం, శంఖం చిత్రాలు చేసాడనుకోండి. ఇప్పుడు ఆయన పూర్తిగా తమిళానికే ఫిక్స్ అయ్యిపోయి, అక్కడే వరసపెట్టి స్టార్ హీరో అజిత్ తో సినిమాలు తీసి సూపర్ హిట్స్ ఇస్తున్నాడు. అజిత్ అత్యంత ఇష్టమైన దర్శకుడుగా ఆయన మారాడు.

  ఇక అసలు విషయానికి వస్తే...అజిత్ నటిస్తున్న 57వ చిత్రంలో హీరోయిన్ గా కాజల్, మరో కీలకపాత్రలో కమలహాసన్ రెండో కూమారై అక్షరహాసన్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ఐరోపా దేశంలో చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే నటి కాజల్ అగర్వాల్‌కు తన చిత్రాల ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టే అలవాటు ఉంది.

   అజిత్ నటిస్తున్న 57వ చిత్రంలో హీరోయిన్ గా కాజల్, మరో కీలకపాత్రలో కమలహాసన్ రెండో కూమారై అక్షరహాసన్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ఐరోపా దేశంలో చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్‌కు దర్శకుడు క్లాస్ తీసుకున్నాడు. కారణం ఏమిటి అన్నది కధనంలో చదవండి.

  తన హ్యాబిట్ ను వదులుకోకుండా..కాజల్ తన తాజా చిత్రానికీ మొదలెట్టింది. నేను..అజిత్, నేను ..ఫలానా లొకేషన్ లో అని. ఇలా అనఫీషియల్ గా సినిమా కు సంభందించిన స్టిల్స్ బయిటకు రావటం దర్శక,నిర్మాతలుకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే అజిత్ లుక్ ని డిఫెరెంట్ గా చేస్తున్నారట. పబ్లిసిటికు పనికివస్తుంది కదా అని చేసాను అని కాజల్ కవర్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందిట. వెంటనే ట్వీట్స్ తీయించి . ఈ విషయం తెలిసిన చిత్ర దర్శకుడు శివ, కాజల్‌కు క్లాస్ తీసుకున్నారట.

  ముఖ్యంగా అజిత్‌కు భార్యగా కాజల్ బెంగాలి బ్యూటీగా ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ గెటప్‌ను వెంటనే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయటమే కొంపముంచింది. అదిప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది

  దర్శకుడు ఇంకెప్పుడూ తమకు చెప్పకుండా ఫోటోలను గానీ, చిత్ర విషయాలను గానీ బయట పెట్టవద్దని గట్టిగానే హెచ్చరించారని సమాచారం. పొరపాటు జరిగిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

  పనిలోపనిగా..కాజల్‌తో పాటు నటి అక్షరకు ముందు జాగ్రత్తగా చిత్రం గురించి ఎవరు అడిగినా వివరాలు చెప్పకూడదని చెప్పారట. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద సినిమాలు సూప్ లో పడతాయి. గెటప్ లు, లుక్ లు ఫస్ట్ లుక్ రాకముందే బయిటకు వచ్చే బోల్డు ఇబ్బింది అయిపోదూ. అదీ మ్యాటర్.

  English summary
  Tamil director Siva angry on Kajal. And now, for the first time, Kajal share screen space with superstar Ajith for Sathya Jyothi Films' AK 57.The movie is a thriller directed by Siva, with music by young sensation Anirudh Ravichander.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X