Just In
- 34 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 41 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 1 hr ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు
హైదరాబాద్: హీరోయిన్ అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్ వివాహబంధం నుంచి దూరమవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట రెండు సంవత్సరాలు కూడా నిండకుండానే విడిపోవటంతో అంతటా చర్చనీయాంశమై,మీడియాలో కంటిన్యూగా వార్తలు వస్తున్నాయి.కొంతకాలంగా వీరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె భర్త విజయ్ కొన్ని విషయాలు మీడియా ముందు ఉంచారు.
ముఖ్యంగా విజయ్ కుటుంబం ఈ విషయంతో మీడియాలోనూ, అబిమానులతోనూ విమర్శలు పాలు అవుతోంది. కావాలనే కుటుంబం ఆమెను దూరం పెడుతోందని, ఆమె కెరీర్ ఆశలు అత్త, మామలు చంపేసే ప్రయత్నం చేసారని, వాళ్లని విలన్స్ గా క్రియేట్ చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో అసలు నిజాలేంటో తెలియచేయాలని విజయ్ మీడియా ముందుకు వచ్చారు.
డైవర్స్ విషయమై అమలాపాల్ భర్త దర్శకుడు విజయ్ స్పందిస్తూ తాను, అమలాపాల్ విడిపోతున్నామన్న విషయం నిజమేనని ప్రకటించారు. తాము విడిపోవడానికి కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు. తామిద్దరం విడిపోతామని కలలో కూడా వూహించలేదంటూనే నమ్మకం, నిజాయితీ లేనప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు.
'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు హీరోయిన్ అమలాపాల్. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు.
తన భర్త విజయ్ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా ఆమె పలుమార్లు ప్రస్తావించారు. అయితే కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోయారని పలు పత్రికలు కూడా ఇటీవల వార్తలు రాస్తూ పలు కారణాలను ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో విజయ్ బుధవారం స్పందించారు.
విజయ్ ఏం మాట్లాడారు స్లైడ్ షోలో చూడండి..

నిజమే...
కొంత కాలంగా తనకు, అమలాపాల్‌కు సంబంధించి పలు వార్తలు వస్తున్నాయని, తాను, అమలాపాల్ విడిపోతున్నామన్న విషయం నిజమేనని ప్రకటించారు.

నిజం లేదు
విడిపోవడానికి సంబంధించిన వార్తల్లో వచ్చిన కారణాల్లో ఏమాత్రం నిజం లేదని, తాము విడిపోతున్నందుకు కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు.

ఇష్టం లేకే
తన స్నేహితులు, కొందరు మీడియా మిత్రులు కారణం చెప్పమని అడిగినా తన వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడం ఇష్టం లేక చెప్పలేదన్నారు.

గౌరవం ఉన్న వ్యక్తిని
మహిళలపై, సమాజంపై గౌరవం ఉన్న వ్యక్తినని, అందువల్లే తాను దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లోనూ వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా స్త్రీల పాత్రలను చిత్రీకరించానన్నారు.

ఒప్పుకున్నాను
పెళ్లి తర్వాత కూడా నటించాలని అమలాపాల్ కోరడంతో సంతోషంగా సరేనన్నానని పేర్కొన్నారు.

అవన్నీ అబద్దాలే
కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నందువల్లే తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ సత్యదూరమేనన్నారు.

కలలో కూడా ఊహించలేదు
తామిద్దరం విడిపోతామని తాను కలలో కూడా వూహించలేదని, అసలు ఇలాంటి సమయం ఒకటి వస్తుందని అనుకోలేదని ఆవేదనతో అన్నారు.

నమ్మకం లేదు
కానీ నమ్మకం, నిజాయితీ లేనప్పుడు కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు.

అందుకే విడిపోతున్నా
నమ్మకం, నిజాయితీ లేనందువల్లే తీవ్రమైన ఆవేదనతో విడిపోతున్నానని చెప్పారు.

మనోవేదన
వాస్తవాలు తెలియకుండా కొన్ని పత్రికలు రాసిన వార్తలతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యా'నని చెప్పారు.

మా నాన్నగారిని
మానాన్నగారు ఓ టిపికల్ ఫాదర్, ఆయన ఈ విషయమై చాలా బాధపడ్డారు. ఓ ఛానెల్ వారితో ఇలాంటి సంఘటనలు ఇంట్లో మా ఇంట్లో జరగటం ఆయన కు చాలా బాధ అనిపించి వ్యక్తం చేసారు. కానీ దాన్ని వేరే రకంగా మీడియా ఎక్సపోజ్ చేసింది.

ఆయన మాటలు పట్టుకునే
మా తండ్రి బాధ తో అన్నమాటలను వక్రీకరిస్తూ మా విడాకుల మ్యాటర్ రకరకాల కథనాలు అల్లేసి ప్రచారం చేస్తున్నారు.

పెళ్లయ్యాక కూడా
చాలా మంది అర్దం చేసుకోవాల్సింది ఏమిటీ అంటే నేను గానీ నా కుటుంబం కానీ ఎప్పుడూ ఆమె స్వేచ్చకు అడ్డుపడలేదు. ఆమె వివాహానంతరం కూడా సినిమాలు కంటిన్యూగా చేసింది.

కావాలనే
కొన్ని పర్టిక్యులర్ మీడియా సంస్దలు నిజానిజాలు పట్టించుకోకుండా మా కుటంబ గౌరవాన్ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

గౌరవిస్తే మంచింది
దయచేసి ఇది మా కుటుంబ విషయం, దాన్ని గౌరవించండి. మా పర్శనల్ స్పేస్ మాకు వదలండి.రూమర్స్ ప్రచారం చేయవద్దు

రూమర్స్ వల్ల
ఇలా రూమర్స్ మీడియాలో ప్రచారం కావటం వల్ల అసలు మా మధ్య ఏం జరిగిందనే విషయం మరుగన పడుతుంది.

త్వరలోనే
మేం త్వరలోనే విడాకులకు అప్లై చేస్తున్నాం. విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం..మిగతావన్ని అబద్దాలే.

తప్పనిసరిపరిస్దితుల్లోనే
తాను సాధ్యమైనంతగా ఈ విషయమై మీడియాకు దూరంగా ఉండాలనుకున్నా...తప్పనిసరి పరిస్దితుల్లో ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు.