Just In
- 10 min ago
అమ్మ బాబోయ్ ఇది మామూలు ప్లానింగ్ కాదు.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’తో మల్లెమాల భారీ స్కెచ్
- 31 min ago
మొత్తానికి ఒక కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్న అఖిల్..!
- 51 min ago
వరుణ్ అలా.. నిహారిక ఇలా.. పెళ్లి తరువాత మాటలు తగ్గాయి: నాగబాబు షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
సెట్లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
Don't Miss!
- News
పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలు
- Sports
గబ్బా రమ్మన్నాడు.. వెళ్లాక చేతులెత్తేశాడు.. ఆసీస్ కెప్టెన్‌పై అశ్విన్ సెటైర్లు
- Finance
4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.15 లక్షల కోట్లు జంప్: అదరగొట్టిన రిలయన్స్
- Lifestyle
ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ ఫేషియల్ మసాజ్
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'కబాలి' టికెట్లు! గిప్ట్ గా ఇస్తానని ప్రకటించిన కలెక్టర్
పుదుచ్చేరి: సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి విడుదల కోసం అభిమానులు మాత్రమే కాక సినీ లవర్స్ అంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గమనించిన పుదుచ్చేరి కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ అభిమాన నటుడి సినిమా చూడాలనుకున్న వారికి ఉచితంగా టిక్కెట్లు ఇస్తానని పుదుచ్చేరి కలెక్టర్ ప్రకటించారు.
Collector in #pondicherry is using gift of tickets of this film as incentive for use of Public Services!Its Working! https://t.co/VNFj5Lodkq
— Kiran Bedi (@thekiranbedi) June 29, 2016
ఇక అందరూ ఊహించినట్టే ఈ ప్రకటనకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకి కిరణ్ బేడి ఓ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ఆయన ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారు
Request Super Star Rajani to b Brand Ambassador of #prosperouspuducherry to be #OpenDeficationFree #ODF @PMOIndia https://t.co/fbCXLCTKuF
— Kiran Bedi (@thekiranbedi) June 30, 2016
మరో ప్రక్క 'కబాలి' సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. వచ్చే నెల 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. అయితే 15న ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలను వచ్చేనెల 15 నుంచి 22కు వాయిదా వేసినట్టు సమాచారం.
'కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటీ సినిమా విడుదలను వారంపాటు వాయిదా వేశారు. ఈ సినిమా ఇక జూలై 22న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ పూర్తికాగానే చిత్ర రూపకర్తలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు' అని తెలిపాయి.

ఇప్పటికే భారీ బిజినెస్ తో పాటు యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న కబాలి సినిమాపై మాలివుడ్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.
దీంతో ఈ సినిమా కేరళ రైట్స్ ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ రైట్స్ తీసుకోవటంతో సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కబాలి యూనిట్.
రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. మలేషియాలో స్థిర పడిన శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ వయసు మళ్లిన డాన్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి జూలై రెండో వారంలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో వయస్సు మళ్లిన డాన్‌గా రజనీ కనిపిస్తుండగా.. ఆయనతోపాటు రాధికా ఆప్టే, దినేశ్, రిత్వికా, ధన్సిక తదితరులు నటిస్తున్నారు.