»   » రిలీజ్ కు ముందే నెట్ లో , మొన్న ఉడ్తా పంజాబ్, ఇప్పుడు ఇంకోటి

రిలీజ్ కు ముందే నెట్ లో , మొన్న ఉడ్తా పంజాబ్, ఇప్పుడు ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మొన్న ఉడ్తా పంజాబి చిత్రం ..రిలీజ్ కు ముందే నెట్ లో టోరెంట్స్ రూపంలో బయిటకు వచ్చి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇండస్ట్రీ తేరుకోక ముందే ఇప్పుడు ఓ తమిళ సినిమా రిలీజ్ కు ముందే నెట్ లో ప్రత్యక్ష్యమైంది. దాంతో చిత్ర హీరో హుటా హుటిన సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఈ విషయమై కంప్లైంట్ చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తన చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో రిలీజ్ కావడంతో ఆ చిత్ర హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్, యూనిట్ షాక్ కి గురయ్యారు. ఇలా చిత్రం మొత్తం విడుదలకు ముందే నెట్‌లో రిలీజ్ కావడం అన్నది ఇదే మొదటి సారి.

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరో గానూ రా నటించిన తాజా చిత్రం ఉనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం శుక్రవారం రిలీజైంది. అయితే అంతకు ముందు రోజే నెట్‌లో రిలీజైన విషయం చిత్ర యూనిట్‌కు తెలిసింది.

G V Prakash files complaint over piracy

దీంతో చిత్ర హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్ సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ కమిషనర్ టీకే.రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో రిలీజ్ కావడంతో తాము తీవ్ర నష్టానికి గురవుతున్నట్లు, కాబట్టి దొంగతనంగా తమ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో ప్రచారం చేసిన వారెవరో కనిపెట్ట వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదును నమోదు చేసుకున్న కమిషనర్ తగిన చర్చలు చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ విషయమై తమిళ పరిశ్రమ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ పైరసీని ఆపటానికి మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. జీవీ ప్రకాష్ కు తమిళ సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.

English summary
Musician-turned-actor G V Prakash Kumar on Monday met the city police commissioner and sought action against the miscreants who posted his Tamil movie 'Enakku Innoru Per Irukku' on the internet even before it hit theatres. He said that one of his friends informed him about the pirated version of the movie uploaded to a website. He said he and the producers have incurred huge losses because of this.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu