For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాత కొడుకు హీరోగా తమిళ హిట్ రీమేక్

  By Srikanya
  |

  చెన్నై: తమిళం నుంచి తెలుగుకు రీమేక్ లు, డబ్బింగ్ లు అవటం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది. అక్కడ హిట్టైన సినిమాలను తెలుగులోకి, తెలుగులో హిట్టైన సినిమాలు తమిళంలోకి రీమేక్ చేస్తూంటారు. అదే కోవలో...విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'గోలీ సోడా' ని తెలుుగులోకి రీమేక్ చేస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'పసంగ' చిత్రంలో నటించిన శ్రీరాం, కిషోర్‌, పాండి, శాంతిని, సీత తదితరులు ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లను కురిపించింది. చిన్న బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం కోట్లాది రూపాయలను సంపాదించి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు రీమేక్‌ హక్కులను ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ దక్కించుకున్నారు. ఆయన కుమారుడు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.

  నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతుండగా దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. 'కోలి సోడా' చిత్రానికి తర్వాత విజయ్‌ మిల్టన్‌ 'పత్తు ఎణ్రదుకుళ్ల' చిత్రాన్ని విక్రం, సమంతతో తెరకెక్కించారు. షూటింగ్ పనులు ముగిసిన నేపథ్యంలో త్వరలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

  Goli Soda to be remade in Telugu

  లగడపాటి శ్రీధర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

  సుధీర్‌బాబు, నందిత జంటగా తెరకెక్కిన చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.... ఆర్.చంద్రు దర్శకత్వం వహించగా.. చైతన్యకృష్ణ, అభిజిత్ ఇతర పాత్రల్లో నటించారు... గతంలో స్టైల్, స్నేహగీతం, వియ్యాలవారి కయ్యాలు వంటి చిత్రాలు నిర్మించిన లగడపాటి శిరీష శ్రీధర్... రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.

  ఇప్పటివరకూ తాను కన్నడలో ఎనిమిది విజయాలు అందుకున్నానని.. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించానన్నాడు దర్శకుడు చంద్రు. మంచి కథా,కథనంతో తెరకెక్కిన ఈ సినిమా తన కెరీర్ లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని హీరోయిన్ నందిత.. సంతోషం వ్యక్తం చేసింది.

  నచ్చకుంటే డబ్బు వాపసు అనే ట్యాగ్ లైన్ ను వ్యాపార ప్రకటనల్లో మినహా.. సినిమాల విషయంలో ఎక్కడా చూడం... కానీ తను తీసే సినిమాలు నచ్చకుంటే డబ్బు తిరిగి ఇస్తానని ఓపెన్ గా ప్రకటించి మరీ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు లగడపాటి శ్రీదర్... అదే కోవలో తన తాజా చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని చూసి నచ్చలేదంటే డబ్బు తిరిగి ఇస్తానంటున్నారు శ్రీదర్.

  మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమంటున్నారాయన... కన్నడనాట సూపర్ హిట్ అయిన ఛార్మినార్ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది... కన్నడలో వరుసగా మూడు సిల్వర్ జూబ్లీ సినిమాలు అందించిన చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడని.. కన్నడ తరహాలోనే తెలుగులో కూడా ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందంటున్నారు శ్రీధర్.

  English summary
  Producer Lagadapati Sridhar has acquired the Telugu remake rights of last year's Tamil blockbuster Goli Soda, which was about four street urchins and their adventures for survival. "I've bagged the remake rights of Goli Soda. I thought it was an extremely good film with great content. Moreover, it succeeded purely on the merit of content and didn't require the presence of a star. The cast will be finalised soon," Sridhar told.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X