»   » అనుష్క ను వృథాగా వదిలిపెట్టనంటున్నాడు

అనుష్క ను వృథాగా వదిలిపెట్టనంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నా గత చిత్రాల తరహాలోనే హీరోయిన్‌గా అనుష్కకూ కచ్చితంగా.. ప్రాధాన్యత ఉంటుంది. అసలు నా చిత్రాలంటేనే హీరోయిన్లకు సగం నిడివి కేటాయిస్తాను. అందులోనూ అనుష్క వంటి ఓ మంచి ఆర్టిస్టును వృథాగా వదిలిపెడతామా? ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. అజిత్‌ చిత్రమని చెప్పటంతో నెలకు పది రోజుల చొప్పున కాల్షీట్‌ మాకు కేటాయించారు. అజిత్‌ - అనుష్క జంట వెండితెరపై కొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయం అన్నారు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.

జయాపజయాలతో నిమిత్తం లేకుండా అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు గౌతమ్‌మీనన్‌. యాక్షన్‌ సినిమాలకు కొత్త ఒరవడి కల్పించిన ఆయన.. తొలిసారిగా అజిత్‌తో చేయి కలిపారు. వీరి కాంబినేషన్‌లో అంచనాల నడుమ 'ఆయిరం తూటాక్కాల్‌' (1000 తూటాలు) రూపొందుతోంది. అజిత్‌ సరసన అనుష్క, ఎమీ జాక్సన్‌ ఆడిపాడనున్నారు. సినిమా గురించి గౌతమ్‌ మీనన్‌ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Gowtham Menon about his latest film with Anushka

అలాగే చిత్రం ఎలా ప్రారంభమైందో చెప్తూ... సూర్యతో నేను రూపొందించాల్సిన 'ధ్రువనక్షత్రం' విరమించుకున్న వారం తర్వాత అజిత్‌, ఏఎం రత్నంతో మాట్లాడితే వారు ఈ చిత్రాన్ని ఖరారు చేశారు. అయితే నా వద్ద అప్పుడు కథంటూ ఏదీ లేదు. నిదానంగానే సిద్ధం చేయండని అజిత్‌ చెప్పారు. నాలుగు నెలల్లో కథ సిద్ధం చేసి ఆయనకు వినిపించా. బాగుందని మెచ్చుకున్నారు. పూర్తి స్క్రిప్టు వినిపించినప్పుడు రేపే షూటింగ్‌ ప్రారంభిద్దామని పేర్కొన్నారు. చిత్ర విషయానికొస్తే.. 'నాలుగు రోజుల్లో వూరంతా క్రిస్మస్‌ జరుపుకుంటుంది. నాకు మాత్రం ఆరోజు దీపావళిరా' అంటూ యాక్షన్‌లో దుమ్మురేపుతారు అజిత్‌. రొమాన్స్‌కు కూడా కొదవలేదు అన్నారు.

విశేషాలు చెప్పమంటే... చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక్కో విషయం చెప్పుకుంటూ వస్తా. మొత్తమ్మీద ఇది భావోద్వేగంతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో కనిపించే అజిత్‌... మహిళలకు కూడా బాగా నచ్చుతారు. ఇక హరీష్‌జైరాజ్‌తో మళ్లీ పనిచేస్తున్నారు కదా అంటున్నారు. మా మధ్య విడిపోవటం అంటూ ఏదీ లేదు. ఈ చిత్రంలో కలిశామనీ లేదు. ఎందుకంటే మేమిద్దరం తరచుగా కలుస్తూనే ఉన్నాం. ఇప్పుడు కలిసి పని చేసే సందర్భం వచ్చింది. ఇద్దరికీ ఇది సరైన చిత్రంగా భావిస్తున్నా అన్నారు.

నిర్మాతగా తన ప్రాజెక్టులు గురించి చెప్తూ... తనలోనే ఉన్న దర్శకుడికి నిశ్శబ్దంగా దారి విడిచి తన సమయం కోసం వేచి చూస్తున్నాడు నాలోని నిర్మాత. ప్రస్తుతం మా నిర్మాణంలోని 'తమిళ్‌సెల్వనుం తనియార్‌ అంజలుం', 'పూవరసం పీపీ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో వచ్చిన 'తంగ మీన్‌గల్‌' ఇటీవల జాతీయ పురస్కారాలు దక్కించుకోవటం చాలా ఆనందాన్నిచ్చింది. అజిత్‌ చిత్ర షూటింగ్‌లో ఉండగా ఆ విషయం నాకు తెలిసింది. అజిత్‌ కూడా తెలియడంతో పైకి లేచి చప్పట్లు కొట్టారు. ఆపై చిత్ర యూనిట్‌ కూడా శృతి కలిపి అభినందించింది. నిర్మాణాన్ని ఇకపైనా కొనసాగిస్తాను అన్నారు.

English summary

 Anushka has begun working for director Gautham Menon's film that stars Ajith as hero. This is the first time that she is acting with Ajith and as well as in a Gautham Menon's film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu