For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలా చేయ్యాలని ఫిక్స్ అయ్యాను..అందుకే నన్ను కుట్టి ఖుష్బూ అంటారు..!

  By Sindhu
  |

  రెండు తెలుగు, మూడు తమిళ చిత్రాలతో అందాల నటి హన్సిక యమ బిజీగా ఉన్నది. ఒకేసారి ఐదు సినిమాలకు సైన్ చేయడం అంటే మాటలు కాదు. డేట్స్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే షూటింగ్‌లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే మిస్ పర్‌ఫెక్ట్ అనిపించుకోవాలన్నదే హన్సిక ధ్యేయం. అందుకే చేతిలో ఉన్న ఐదు సినిమాలకు పక్కాగా డేట్స్ ఇచ్చేసింది.

  దేశముదురు, కంత్రి, మస్కా.. ఇలా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ టీనేజ్ బ్యూటీ దాదాపు ఏడాది తర్వాత తెలుగులో కమిట్ అయిన చిత్రం కందిరీగ. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు..? అని అడిగితే...'తెలుగులో నా గత చిత్రం నిరాశపరిచింది. ఈసారి సంతృప్తి పరిచే సినిమా చేయాలనే ఆలోచనతోనే మంచి సినిమాకోసం ఆగాను. నేను తీసుకున్న ఈ గ్యాప్ నాకు మంచే చేసిందని మిస్ ఫర్ ఫెక్ట్ గా చెప్తోంది.

  కందిరీగ లాంటి ఎగ్జయిటింగ్ ప్రాజెక్టుకి అవకాశం వచ్చింది. ఈ చిత్రకథ, నా పాత్ర చాలా బాగున్నాయి. మస్కా తర్వాత మళ్లీ రామ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అలాగే ఈ గ్యాప్‌ లో నాకు తమిళ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. అవి బాగుండటంతో అంగీకరించాను. మీకు తెలుసా...తమిళంలో నాది ఒక్క సినిమా కూడా విడుదల కాక మునుపే మూడు సినిమాల్లో అవకాశం వచ్చింది. అన్నీ మంచి సినిమాలే కావడంతో ఒప్పుకున్నాను. తమిళులు నన్ను 'కుట్టి ఖుష్బూ' అంటూ అభిమానం కనబరుస్తున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు శుక్రవారం నా తమిళ సినిమా మాప్పిళ్లయ్ విడుదల కాబోతోంది. ఇది మంచి సినిమా కాబట్టి టెన్షన్ పడటం లేదు. పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులకు నేను మరింత దగ్గరవుతా. తమిళంలో ఎంగేయుమ్ కాదల్, వేలాయుధం, ఒరు కాల్ ఒరు కన్నాడి...సినిమాలు చేస్తున్నాను. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే విడుదల కాబోతున్నాయి.

  ఇక తెలుగు విషయానికి వస్తే అగ్ర నిర్మాణ సంస్థలైన బెల్లంకొండ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న కందిరీగ, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'ఓ మై ఫ్రెండ్" చిత్రాలు ఈ ఏడాదే తెరపైకి వస్తాయి. ఈ రెండు చిత్రాల్లో మంచి పాత్రలు చేస్తున్నాను. ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు విడుదల కావడం నాకెంతో ఆనందంగా ఉంది. కనుక 2011 సంవత్సరం నాదే" అంది హన్సిక. ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం వల్ల ఒత్తిడి ఎదురవుతుంది కదా..? అని అడిగితే.. 'నేను హార్డ్ వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నా వయసు ఇపుడు 19. ఈ వయసులో కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటే...ఆ తర్వాత బాధపడుతూ కూర్చోవాల్సిందే. 365 రోజులూ పని చేయడం నాకిష్టం. మీకో విషయం చెప్పనా... ఈ మధ్య నా సూట్‌కేస్ ఎప్పుడూ సర్దే ఉంటుంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్, చెన్నైకి ప్రయాణాలు ఎక్కువయ్యాయి. ఈ బిజీని ఎంజాయ్ చేస్తున్నాను" అంది హన్సిక.

  English summary
  Hansika is busy with two Telugu and three Tamil movies. It is not easy to work for five movies at a time given the present trend of shooting in foreign locales. Hansika’s aim is to be known as Miss Perfect. Hansika got three movies in Tamil even before release of her first Tamil movie. Fans in Tamil started calling her as junior Khushboo.On Friday, Hansika’s first Tamil movie Mapillai is releasing. Her other Tamil movies will be released in this year itself.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X