హాట్ హన్సిక కష్టాలు...తప్పదంటున్న డైరక్టర్

By Srikanya

చెన్నై : ఓ తమిళ చిత్రంలో కత్తి యుద్ధం చేసే సన్నివేశాల్లో నటించిన హన్సిక చేతి వేళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడిందట. ఈ కారణంగా ఆమె పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావట. విజయ్‌ హీరోగా నటిస్తున్న 'పులి'లో హన్సికకు ఈ సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. ఇటీవల దీనికి సంబంధించిన షూటింగ్‌ జరిపారు.

ఆమె చేతి వేళ్లకు నొప్పి కలగడంతో తన బాధలను దర్శకుడు శింబుదేవన్‌కు తెలిపారట. ఇలాంటప్పుడు ఆ మాత్ర ఇబ్బంది తప్పదని ఆయన కొనసాగించారట. కొన్ని మెలకువలు పాటిస్తే కష్టాలు ఉండవని కూడా ఆమెకు సూచించారట. కాగా, హాంకాంగ్‌ నుంచి వచ్చిన ఓ విదేశీ కళాకారుడు ఆమెకు ప్రస్తుతం కత్తి యుద్ధంలో శిక్షణ ఇస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే..

Hansika Motwani to do sword fighting

గత కొంత కాలంగా కత్తిపట్టి శత్రుసైన్యాలతో అలుపెరగని పోరాటం సాగిస్తున్నాను. ఈ క్రమంలో గాయాలను సైతం లెక్కచేయకుండా కదనరంగంలో శత్రువులను మట్టికరిపిస్తున్నాను అన్నారు హన్సిక. ఈ వైట్ బ్యూటీ ఇంత హంగామా చేస్తోంది విజయ్‌తో శింబుదేవన్ రూపొందిస్తున్న తమిళ చిత్రం పులి కోసం. విజయ్ కథానాయకుడిగా సోషియో, ఫాంటసీ నేపథ్యంలో ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హన్సిక యువరాణిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది. కథానుగుణంగా ఇందులో ఆమెపై కొన్ని భారీ పోరాట ఘట్టాలున్నాయి.

వీటిని కొంతకాలంగా ఆమెపై తెరకెక్కిస్తున్నారట. ఈ సన్నివేశాల గురించి హన్సిక మాట్లాడుతూ ఇలాంటి పోరాట ఘట్టాల్లో నటించడం ఇదే మొదటిసారి. కత్తియుద్ధాల్లో ఉండే కష్టమెంటో ఈ సినిమాతో తెలిసింది. తొలిసారి కత్తిపట్టుకోగానే చాలా భయమేసింది. వాటి బరువును తట్టుకొంటూ సన్నివేశాల్లో నటించడానికి చాలా శ్రమించాల్సివస్తోంది. కత్తి పదును వల్ల చేతులు, వేళ్లకు గాయాలయ్యాయి. అయినా ఆ భాదను ఒర్చుకుంటూ ఛాలెంజ్‌గా భావించి ఈ సన్నివేశాల్ని పూర్తిచేశాను. ఇందుకోసం కొన్నాళ్లపాటు ఓ విదేశీ శిక్షకుడి వద్ద యుద్ధ్ద విద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్నాను.

తొలిసారి ఇలాంటి పోరాట ఘట్టాల్లో నటించడం సరికొత్త అనుభూతిని కలిగించింది. నటిగా నాలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. నా కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోతుందన్న నమ్మకముంది అని చెప్పింది. ఈ చిత్రంలో హన్సిక తల్లిగా అలనాటి అందాల నటి శ్రీదేవి నటిస్తోంది. దాదాపు ఇరవై ఏళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న తమిళ చిత్రమిది కావడం విశేషం. శృతిహాసన్ మరో నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X