»   » రజనీ హెల్త్ దెబ్బకొట్టింది ఆ కాస్టూమ్స్ నేట, అసలు నిజం ఇదేనా?

రజనీ హెల్త్ దెబ్బకొట్టింది ఆ కాస్టూమ్స్ నేట, అసలు నిజం ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ అమెరికాలో హెల్త్ ప్లాబ్లంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఓ ప్రక్కన వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క అలాంటిదేమి ఆయన కేవలం తన కుటుంబం తో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేయటానికి వెళ్లారని ఖండనలు వస్తున్నాయి. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని సిట్యువేషన్ లో అభిమానులు ఉండగా ఇప్పుడు ఇంకో వార్త రజనీ అభిమానులను కలవరపెడుతోంది.

రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ 2 ఓ షూటింగ్ కోసం రజనీకాంత్ తన శక్తికి మించి కష్టపడి అనారోగ్యం పాలైనట్లు చెప్తున్నారు.ఈ చిత్రంలో రజనీకాంత్ ఎక్కువ సీన్స్ లో విచిత్రమైన కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. ఈ కాస్ట్యూమ్స్ బరువు సుమారు 40 కేజీలు దాకా ఉంటుందిట.

ఈ సినిమాలో రజనీ రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఒకటి సైంటిస్ట్ వశీ, రెండవది హ్యూమనాయిడ్ రోబో, రోబో పాత్రకు ఇలాంటి స్పెషల్ కాస్ట్యూమ్స్ వాడారట. సినిమాలో అవే ప్రత్యేక ఆకర్షమగా కనిపిస్తాయట.

ఈ కాస్ట్యూమ్స్ ధరించి వేసవిలో అవుట్ డోర్‌లో మండే ఎండల్లోనూ, మేకప్ చెడిపోకుండా ఇండోర్‌లో ఏసీ ఫ్లోర్‌లోనూ నటించడం చేసారట. ఇలాంటి కష్టమైన సీన్స్ లో రజనీకాంత్ నటించటం వల్లనే ఆయన అనారోగ్యం పాలయ్యారని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Heavy costumes for Rajini in ‘2.o’ leads to health problem?

దాంతో శంకర్ ..కాస్ట్యూమర్ ని పిలిచి కాస్ట్యూమ్స్ చాలా లైట్ గా ఉండేవి డిజైన్ చేయమని చెప్పారట. ఎందుకంటే డాక్టర్స్ ఇక ఆ బరువైన కాస్ట్యూమ్స్ ఎట్టిపరిస్దితుల్లోనూ వాడటానికి వీల్లేదని చెప్పారట.

అయితే ఈ విషయాల్లో నిజం ఎంతుంది, ఇది కేవలం రూమరా అనేది పక్కన పెడితే రజనీకాంత్ మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన మాట వాస్తవం అంటున్నారు మరికొదర. వారు చెప్పేదాని ప్రకారం అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకున్న రజనీ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే సూపర్‌స్టార్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.

ఇక రోబో 2 చిత్రం షూటింగ్ అధిక భాగం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను రజనీకాంత్ దాదాపు పూర్తి చేశారని సమాచారం. ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఇంకా రజనీకాంత్ నటించే సన్నివేశాలు తక్కువేనని తమిళ సినీ వర్గాల టాక్.

English summary
In ‘2.o’, Superstar Rajinikanth is said to be wearing heavy costumes and major portions of the shoot is said to be happening in AC floor as the prosthetic makeup shouldn’t be spoiled. It is said that Rajinikanth’s health condition got worsen only because of the heavy costumes and cool ambiance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu