దర్శకుడిగా బిజీ కానున్న స్టార్ హీరో.. హిట్టు గ్యారెంటీ అంటున్నాడు
కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ సెట్ చేసుకున్న తెలుగు నటుడు విశాల్. తండ్రి నిర్మాత కావడం వలన మొదటి నుంచి తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా వర్క్ చేసి అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే విశాల్ ఎలాంటి తమిళ్ సినిమా చేసినా కూడా అవి తెలుగులో విడుదల కావాల్సిందే. సామాజిక అంశాలపై ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేస్తున్న విశాల్ నెక్స్ట్ దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేయనున్నాడు.
విశాల్ ఈ శుక్రవారం చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్సీడ్ టాక్ తో వెళుతోంది. అయితే మొదట డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విశాల్ ఎన్నో కథలను సెట్ చేసుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక నెక్స్ట్ డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ సినిమా ద్వారా విషల్ మొదటిసారి దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే అభిమన్యుడు సినిమాకు కూడా సీక్వెల్ రానున్నట్లు అప్పట్లో టాక్ అయితే వచ్చింది.

నిజానికి అది సీక్వెల్ కాదట. సొంతంగా మరొక యాక్షన్ కథను రెడీ చేసుకున్నట్లు విశాల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ప్రస్తుతం 'ఎనిమీ' అనే సినిమాను చేస్తున్నట్లు చెప్పిన విశాల్ తప్పకుండా ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అన్నాడు. ఇక ఆ సినిమాలో మరో హీరో విశాల్ కూడా నటిస్తుండడం విశేషం. ఇదివరకే వీరిద్దరు వాడు వీడు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











