»   » రోజూ చెమటపట్టేదాకా చేస్తా..అదే నా గ్లామర్ శ్రియ

రోజూ చెమటపట్టేదాకా చేస్తా..అదే నా గ్లామర్ శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

"సినిమా స్టార్ గా పదికాలాల పాటు పరిశ్రమలో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలంటే అందాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిందే. అందుకే నేను చెమట పట్టేదాకా రోజూ క్రమం తప్పకుండా రక రకాల వ్యాయామాలు చేస్తాను. వారంలో మూడు రోజుల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు...మరో మూడు రోజులు స్విమ్మింగ్‌ చేస్తాను. అలాగే ప్రతి రోజూ అరగంటకు పైగా యోగా చేస్తాను. యోగా అనంతరం మెడిటేషన్‌ చేస్తాను. దాంతో శరీరంతో పాటు మనసు కూడా తేలిక పడుతుంది. నా గ్లామర్‌ రహస్యం ఇదే...' అని చెప్పుకొచ్చారు శ్రియ. ప్రస్తుతం శ్రియ తమిళంలో 'చికుబుకు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిగాక మలయాళంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రం పేరు 'పోకిరి రాజా'. ఇందులో పృథ్విరాజ్‌ సరసన శ్రియ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సంక్రాంతికి ధనష్ తో కలిసి ఆమె నటించిన ఆర్య రీమేక్ కట్టి చిత్రం యావరేజ్ అనిపించుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu