»   » 'రోబో 2' గురించి నమ్మలేని నిజం

'రోబో 2' గురించి నమ్మలేని నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ సినిమా అంటే యావత్ భారత్ దేశం ఎదురుచూస్తుంది. ఇతర దేశాల్లోనూ చాలా ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిని రీచ్ అవ్వాలంటే దర్శకుడు ఎన్నో సర్కస్ ఫీట్స్ చేయాలి. లేకపోతే మరో లింగా రావచ్చు..కొచ్చడియాన్ రావచ్చు అనే భయం ఉంటుంది. అందుకే దర్శకుడు శంకర్ ...తన తాజా చిత్రం రోబో 2 కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నాడు. కొత్త సెట్స్ తో ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా దాదాపు రెండు వందల యాభే కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు. అక్కడ పది ఎకరాల స్థలంలో ఒక మోడరన్ సిటీ రెడీ చేస్తున్నారు. ఈ సెట్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిసింది.

Huge sets for Rajani's Robo-2

ఈ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేసారు.

అలాగే ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు. రజనీకాంత్ సరసన బ్రిటన్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా చేస్తున్నారు.

చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం.

English summary
Huge sets to shoot Rajani's Robo-2 film have been erected in a location of Poonamallee near Chennai. Rajinikanth and Amy Jackson have joined hands for the highly anticipated sequel of ROBO, which also stars Bollywood actor Akshay Kumar as the villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu