»   » ప్రియా వారియర్‌కు మరో షాక్.. సినిమాపై మత సంస్థ ఫత్వా..

ప్రియా వారియర్‌కు మరో షాక్.. సినిమాపై మత సంస్థ ఫత్వా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ చిత్రం ఓరు అదార్ లవ్‌ చిత్రానికి, ఆ చిత్రంలో అద్భుతమైన హావభావాలు ప్రదర్శించిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు మరో షాక్ తగిలింది. ఆ చిత్రంలోని పాట తమ మతానికి వ్యతిరేకంగా ఉందని, తమ మనోభావాలను దెబ్బ తీశారని బుధవారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నామా పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. అది అలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన ముస్లిం మత సంస్థ ఈ చిత్రంపై ఫత్వా విధించడం మరో సంచలనంగా మారింది.

పాటను తొలగించాలి

పాటను తొలగించాలి

ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని పాటను విడుదలకు ముందే తొలగించాలి. లేకపోతే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని దారుల్ ఇఫ్తా జామియా నిజామియా అనే ముస్లిం మత సంస్థ హెచ్చరించింది. హైదరాబాద్‌లోని షిబ్లీ గంజ్‌కు చెందిన ఈ సంస్థ.. సినిమాలోని పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రవక్తను అవమానిస్తారా?

ప్రవక్తను అవమానిస్తారా?

ఒరు అదార్ లవ్ సినిమాపై మా అభ్యంతరం ఏమీ లేదు. మా అభ్యంతరమంతా మాణిక్య మలరాయ పూవీ అనే పాటపైనే. ఆ పాటలో మహ్మద్ ప్రవక్తను, ఆయన సతీమణిని కించపరిచే విధంగా సాహిత్యం ఉంది. ఆ పాత్రల మధ్య సంబంధాన్ని చెప్పడానికి మరో రకమైన పేర్లను పెట్టుకోవాలి.

వివాదంలోకి ప్రవక్త

వివాదంలోకి ప్రవక్త

ప్రవక్త పేరును ఎందుకు వివాదంలోకి లాగుతారు. అందుకే ఈ సినిమాలోని పాటలో ఉన్న ప్రవక్త పేరును తొలగించాలి. ఆ కారణంగానే సినిమాపై ఫత్వా జారీ చేశాం అని జామియా నిజామియా కార్యదర్శి ఆహ్మద్ ఆలీ పేర్కొన్నట్టు జాతీయ దినపత్రిక చెందిన వెబ్‌సైట్ పేర్కొన్నది.

ఫలక్‌నామాలో కేసు

ఫలక్‌నామాలో కేసు

ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని పాటలో కనిపించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంలోని పాటపై సెక్షన్ 295ఏ కింద ఫలక్‌నామా పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఫత్వా కూడా జారీ కావడంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.

English summary
The sensational clip is gifted by the song 'Manikya Malaraya Poovi' from the upcoming movie Oru Adaa. Turns out this clip is from a Malayalam song Manikya Malaraya Poovi from the movie Oru Adaar Love. The song is already a big hit, it has clocked in 10 million views already! Hyderabad seminary issues fatwa against Malayalam song over Prophet reference
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X