»   » న్యూడ్ సీన్లలో నటించింది నేనే.. డూప్ కాదు..

న్యూడ్ సీన్లలో నటించింది నేనే.. డూప్ కాదు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో కంగనా రనౌత్‌ది ప్రత్యేకమైన శైలి. తెరమీద నటించడంలోనే కాదు.. మాట్లాడటంలోను బోల్డ్‌గా ఉంటుంది. పాత్రకు అవసరమవుతుందనుకుంటే ఎంతవరకైనా వెళ్తుంది. తాజాగా ఆమె నటించిన రంగూన్ చిత్రంలోని సన్నివేశాలపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

యూట్యూబ్‌లో రంగూన్ టీజర్ సెన్సేషన్

యూట్యూబ్‌లో రంగూన్ టీజర్ సెన్సేషన్

షాహీద్ కపూర్, సైఫ్ ఆలీఖాన్, కంగన నటించిన రంగూన్ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నది. ఈ చిత్రంలో కంగన, షాహీద్‌ల మధ్య శృంగార దృశ్యాలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. అలాంటి సీన్లపై కంగన ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

కెమెరా ట్రిక్కు కాదు.. డూప్ కాదు..

కెమెరా ట్రిక్కు కాదు.. డూప్ కాదు..

చిత్రంలో కనిపించే సీన్లు కెమెరా ట్రిక్కులు, డూప్ కాదని కంగన తెలిపింది. పలు శృంగార దృశ్యాలలో కంగన నిజంగానే టాప్‌లెస్‌గా కనిపించిందట. అయితే ఆ సన్నివేశాల్లో డూప్‌ను ఉపయోగించారని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ‘నగ్న సన్నివేశాల కోసం ఎలాంటి ట్రిక్కులూ ఉపయోగించలేదు. ఆ సన్నివేశాల్లో నటించింది నేనే. అది కూడా నటనలో ఓ భాగమే‘ అని కంగన స్పందించింది.

పరిశ్రమలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు..

పరిశ్రమలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు..

సినీ పరిశ్రమలో తనకు ఫ్రెండ్స్ లేరని, బయటి వ్యక్తులే తనకు నిజమైన స్నేహితులు అని కంగన తెలిపింది. పరిశ్రమలో ఎక్కువగా చనువుగా ఉంటేనే లింకులు అంటగడుతారు. నిజంగా స్నేహంగా చేస్తే ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించింది. తన సంబంధాలన్నింటిని కాంప్లికేట్ చేశారని చెప్పింది. ఫ్రెండ్ షిప్ తన ఏకాగ్రతను, పనిని దెబ్బతీస్తుందని వివరించింది.

సినీ హీరోలతో అఫైర్లు

సినీ హీరోలతో అఫైర్లు

బాలీవుడ్ క్వీన్ అనేక మంది హీరోలతో రిలేషన్స్ ఉన్నట్టు మీడియాలో రూమర్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. తొలుత యువ హీరో సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలితో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రాజ్ సినిమాలోని సహనటుడి అధ్యాయన్ సుమన్‌తో అఫైర్ ఉన్నట్టు రూమర్ వచ్చింది. ఇటీవల హ‌ృతిక్ రోషన్‌తో వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. హృతిక్‌ను చిల్లర మాజీ ప్రియుడు అని వ్యాఖ్యలు చేసింది.

English summary
the feisty actress Kangana Ranaut had just one agenda on her mind. To be her true self- outspoken, unabashed and extremely brazen. And she left everyone gasping for breath as she spewed fire throughout. she said she acted in nude scenes in Rangoon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu