»   » మినిస్టర్ దగ్గర కొట్టేసిన 500 కోట్లులో నాకు షేర్ వద్దు: హీరో కార్తీ

మినిస్టర్ దగ్గర కొట్టేసిన 500 కోట్లులో నాకు షేర్ వద్దు: హీరో కార్తీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మినిస్టర్ వద్ద కొట్టేసిన ఆ ఐదు వందల కోట్లు డబ్బులో నాకు షేర్ వద్దు అంటున్నారు తమిళ హీరో కార్తి. అయితే ఇది సరదాకేనండోయ్. కమిడియన్ వివేక్ పుట్టిన రోజు సందర్బంగా కార్తీ ఈ విధంగా ట్వీట్ చేసి అందరినీ నవ్వించారు. అవును ఈ ఐదు వందలకోట్లు అనగానే మీకు ఏం గుర్తుకు వస్తోంది. ఏం గుర్తుకురావటం లేదా...పోన్లెండి అంత శ్రమ వద్దు నేనే చెప్పేస్తాను.

'అరుంధతి'కి తమ్ముడు,'బాహుబలి'కి బావమరిదేరా!! ( కార్తి 'కాష్మోరా' రివ్యూ)

రీసెంట్ గా కార్తీ హీరోగా కాశ్మోరా చిత్రం వచ్చింది కదా. అందులో కార్తికి తండ్రిగా వివేక్ చేసారు. తండ్రి, కొడుకులిద్దరూ కలిసి జనాలని మాయలు, మంత్రాలు అంటూ బురిడికొట్టించి డబ్బులు నొక్కేస్తూంటారు. వీళ్లు తమ టాలెంట్ తో ఓ మినిస్టర్ ని సైతం నమ్మించేస్తూంటారు. అలా వీళ్ల మాయలో పడ్డ ఓ మినిస్టర్..తమ మీద ఇనకం టాక్స్ వాళ్లు దాడి చేస్తున్నారనే భయంతో..ఓ ఐదు వందల కోట్లు...హీరో ఇంట్లో దాస్తారు.

I don't want share in that Rs. 500 crore Vivekh: Tweets Karthi

అది చూసిన హీరో తండ్రి వివేక్..ఆ డబ్బుతో జంప్ అవ్వాలనుకుంటారు. అక్కడ నుంచి వాళ్లకు వచ్చే తిప్పలే కాశ్మోరా కథ. సినిమా చివరి వరకూ ఆ మినిస్టర్ నా ఐదు వందలు కోట్లు అంటూ తిరుగుతూంటాడు. చివర్లో కూడా ఐదు వందల కోట్ల మీద పంచ్ ఉంటుంది. అదీ మ్యాటర్ . ఇవన్నీ గుర్తు పెట్టుకునే కార్తీ..సరదాగా ఇదిలో ఇలా ట్వీట్ చేసి పుట్టిన రోజున నవ్వించేసాడు.

ఇక ఈ ట్వీట్ చూసిన కార్తీ ఫ్యాన్స్ ...తెగ రిప్లైలు ఇస్తున్నారు. కార్తీలోని ఫన్నీ నేచర్ కు, తోటి ఆర్టిస్ట్ లకు ఆయన ఇచ్చే గౌరవానికి ఇది ఓ ఉదాహరణ అని తమిళ మీడియా అంటోంది.

English summary
Actor Karthi couldn't forget one scene from his hit movie Kashmora while wishing Vivekh a happy birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu