twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలు మనకొద్దంటూ స్టార్ హీరో ట్వీట్

    By Srikanya
    |

    Vijay
    చెన్నై : రాజకీయ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన 'తలైవా' (అన్న) ఇక రాజకీయాల జోలికే పోకూడదని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. 'తలైవా' పట్టం కంటే అభిమానుల గుండెల్లో 'ఇళయదళపతి'గానే మిగిలిపోవాలనుకుంటున్నారు విజయ్. 'తలైవా' సినిమాతో చోటుచేసుకున్న పరిణామాలతో విజయ్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజకీయాలు వద్దని, అభిమానులు కూడా రాజకీయాలకు దూరంగా వుండాలని విజయ్ పిలుపునిచ్చారు.

    అలా కాదని, ఎవరైనా రాజకీయ ప్రస్తావన తెస్తే అభిమాన సంఘాలను రద్దు చేసేస్తానని కూడా హెచ్చరించారు. ఇంకెప్పుడూ తన రాజకీయ ప్రవేశం గురించి ఎక్కడా మాట్లాడకూడదని, రాజకీయ నేపథ్యమున్న కార్యక్రమాల్లో పాల్గొనవద్దని అభిమానులకు సూచిస్తూ, విజయ్ ట్విట్టర్‌లో ఒక సందేశాన్నిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

    అయితే ఆ 'ట్వీట్' నిజం కాదని, ఈ వ్యాఖ్యలతో విజయ్‌కి సంబంధం లేదని, అసలు విజయ్ ట్విట్టర్‌లో లేరని ఆయన మేనేజర్ స్పష్టం చేశారు. ఏమైనా, రాజకీయాలు మనకొద్దంటూ విజయ్ చేసిన వ్యాఖ్య అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. తమిళనాట సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి చరిష్మా కలిగిన విజయ్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకోసమే, విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తూ, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇక తలైవా చిత్రం విడుదల వరకూ హై డ్రామా నడిచిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం 'తలైవా'..(అన్న) విడుదలకు మార్గం సుగుమం చేయాలంటూ ముఖ్యమంత్రికి స్వయంగా విన్నవించుకునేందుకు విజయ్‌ ప్రయత్నించగా 'అమ్మ' కనీసం అందుకు అనుమతి కూడా ఇవ్వకపోవటం విజయ్ కు షాక్ అయ్యింది అపై చిత్ర నిర్మాత చంద్రప్రకాష్‌ జైన్‌, దర్శకుడు ఏఎల్‌ విజయ్‌లు కమిషనర్‌ను కలుసుకుని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తలైవా ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. విజయ్‌ అభ్యర్థను తోసిపుచ్చుతూ ఆయన చేపట్టాలనుకున్న దీక్షకు నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు, శాంతిభద్రతులు పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే పనిచేస్తోందని, తలైవా చిత్ర విడుదలను కూడా అడ్డుకుంటూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఆరోపించారు.

    English summary
    Vijay in a statement confirmed that he has no intentions of entering politics and that his fans shouldn’t indulge themselves in any work that could portray him as a political leader. Vijay who was shocked seeing this has issued a stringent statement to his fans. In this statement he has mentioned, “ I have no intention of coming to politics. I request all of you nit to use any political messages in my banners. If you continue to do this, I will not hesitate to dissolve the concerned fan clubs. I have decided to involve myself directly in the matters related to fan clubs. Neither my father nor anyone else will interfere in these matters.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X