»   » హీరో తీరుపై మండిపడుతున్న ఇళయరాజా

హీరో తీరుపై మండిపడుతున్న ఇళయరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ilayaraja
చెన్నై : దర్శక నటుడు శశికుమార్‌ తీరుపై ఇళయరాజా మండిపడుతున్నారు. మీడియా వద్ద తన బాధను వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన పాటలను రెండింటిని రీమిక్స్ చేసి వాడేసారని ఆయన సీరియస్ అవుతున్నారు.


ఇళయరాజా స్వరపర్చిన గీతాలకు ఇప్పటికీ తరగని ఆదరణ ఉంది. వాటిల్లో కొన్నింటిని కొత్త సంగీత దర్శకులు రీమిక్స్‌గా ఉపయోగిస్తుంటారు. తాజాగా దర్శక నటుడు శశికుమార్‌ తన కొత్త చిత్రం 'కుట్టిపులి'లో ఇళయరాజా స్వరపర్చిన రెండు పాటలను వినియోగించుకున్నాడు.

ప్రేక్షకులను నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇళయరాజా మాత్రం ఈ విషయంలో శశికుమార్‌ తీరును తప్పుపట్టారు. ఆ పాటల్ని చిత్రంలో ఉపయోగించుకునేందుకు స్వరకర్తగా తన అనుమతిని తీసుకోలేదన్నాడు.

నటుడిగా, దర్శకుడిగా శశికుమార్ తొలిచిత్రం 'సుబ్రమణ్యపురం' సంచలన పేరు సొంతం చేసుకుంది. ఆపై సముద్రఖని దర్శకత్వంలో 'నాడోడిగల్‌'లో ప్రధానపాత్ర పోషించాడు. అది మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై 'పసంగ', 'పోరాళి'లో నటించిన శశికుమార్‌ చివరగా ప్రభాకరన్‌ దర్శకత్వంలో 'సుందరపాండియన్‌'లో కనిపించాడు. ఇదికూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. గత ఏడాది ఘన విజయం అందుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. తాజాగా 'కుట్టిపులి'లో నటిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం శశికుమార్ నటించి,నిర్మించిన సుందరపాండ్యన్ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
In KUTTI PULI film... excessive usage of old songs especially Ilayaraja’s ‘Ponnoviam Kandenamma’ appears more like a mockery than a tribute. And there are many such songs used which are annoying to say the least.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu