Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కమల్ టీమ్ లో భయం...భయం: ఒక్కొక్కరి ఒక్కో..అవాంఛనీయ సంఘటన
చెన్నై: కొన్ని లాజిక్ కు అందవు...ఇప్పుడు కమల్ హాసన్ తాజా చిత్రం షూటింగ్ లో జరుగుతున్న సంఘటనలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. వరస పెట్టి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న టీమ్ ..లేదా వాళ్ల కుటుంబంలో వారికి ఏదో ఒక సమస్య వస్తోంది.
కమల్ సూపర్ హిట్ ...దశావతారం సినిమాలోని బలరాం నాడార్ ప్రాతను ప్రధాన పాత్రగా తీసుకుని కమల్ హాసన్ నటిస్తున్న సినిమా శభాష్ నాయుడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అమెరికాలో జరుగి, బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు బ్రహ్మానందం, రమ్యకృష్ణ అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడ కొన్ని సమస్యలు వచ్చినా పూర్తి చేసుకుని కమల్ వచ్చారు.
వాస్తవానికి గతంలో కమల్ సినిమా రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ ఇప్పుడు షూటింగ్ సమయంలోనే ఈ యూనివర్సల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు.అవి కూడా చాలా చిత్రంగా ఉండటంతో అందరినీ ఆలోచనలో పడేస్తోంది. తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగు, తమిళం, హిందీల్లో త్రిభాషా చిత్రంగా రూపొందించనున్నాయి. సంగీతం ఇళయరాజా. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తారని వెల్లడించారు. హిందీ వెర్షన్‌లో బ్రహ్మానందం పాత్రకు మరొకరిని ఎంపిక చేశామని పేర్కొన్నారు.
శృతిహాసన్ తొలిసారిగా తనతో కలిసి నటించనుందని, అయితే హీరోయిన్‌గా మాత్రం కాదని స్పష్టం చేశారు. ఆమెది అమెరికాలో చదువుకునే తెలుగమ్మాయి పాత్ర అని చెప్పారు. తెలుగు వెర్షన్‌కు సంభాషణలను శశాంక్ వెన్నెలకంటి రాశారన్నారు.
'దశావతారం' చిత్రంలోని సీబీఐ అధికారి పాత్రకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో దాని స్ఫూర్తిగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇది పూర్తిగా హాస్యభరిత చిత్రమని వివరించారు. చిత్రీకరణ దాదాపుగా అమెరికాలో జరగనుందని చెప్పారు. తన తండ్రితో కలిసి నటించనుండటంపై శృతిహాసన్ ఆనందం వ్యక్తం చేసింది. చిత్రానికి కథ, స్క్రిప్టు కమలహాసన్ అందిస్తున్నారు.
స్లైడ్ షోలో కమల్ కు వచ్చిన చిత్రమైన సమస్యలు

ముందుగా....
ఈ సినిమాను మళయాల స్టార్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా రాజీవ్ తప్పుకోవటంతో కమల్ దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నాడు.

గాయపడటం బ్రేక్
విజయవంతంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన కమల్, తన ఆఫీస్ లో గాయపడటం, సర్జరీ జరగటంతో సినిమా షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడింది.

ఎడిటర్ భార్య
కమల్ కొలుకుంటున్న సమయంలోనే ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్న జేమ్స్ జోసెఫ్ భార్య కు ఏక్సిడెంట్ అవటంతో ఆయన కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు ఆయన కూడా
తాజాగా చిత్ర సినిమాటోగ్రాఫర్ గుమ్మడి జయకృష్ణ కూడా తప్పుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు అయితే తెలియరాలేదు

ఇంకేమి జరుగుతాయో
ఇలా వరస పెట్టి టీమ్ లో అందరికీ చిత్రమైన సమస్యలు వెంటాడుతూండటం కమల్ ని కూడా ఆందోళనలో పడేస్తోంది.

కో ఇన్సిడెంట్స్
అయితే కమల్ మాత్రం ఇవన్నీ కో ఇన్సిడెంట్స్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారుట.

ముడిపెట్టద్దు
యాక్సిడెంట్స్, అనారోగ్యాలు అనేవి చాలా సహజం అని, అయితే అవి ఒక్కసారిగా టీమ్ లో వారికి రావటం జరిగిందని, ఒకదానికొకటి ముడిపెట్టవద్దని చెప్తున్నాడట

ఆర్దికంగా
ఈ సినిమా ఎట్టిపరిస్తుల్లో పినిష్ చేసి, చెప్పిన సమయానికి విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకన్నాడట.

అంతా కొత్త టీమ్
కమల్ ఈ సినిమాకు పనిచేసే టీమ్ అంతటినీ మార్చే ఆలోచనలో ఉన్నాడట. మరి వీటన్నింటినీ దాటి శభాష్ నాయుడు ఎప్పుడు థియేటర్లకు చేరతాడో చూడాలి.

కమల్ డైరక్షన్
ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో శభాష్ నాయుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు కమల్.

కీలకపాత్రల్లో
బ్రహ్మానందం, శృతి హాసన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అనవసరమైన పబ్లిసిటీ
తమ టీమ్ కు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మీడయాలో వార్తలు వస్తూండటంతో ఆయన చిరాకు పడుతున్నారట.

నిలబడగలుగుతున్నా
'నేను నిలబడగలుగుతున్నాను, త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాల్లో తెలియడం లేదు' అనికమల్ చెప్పినట్లు సమాచారం.

ప్రేమకు
'ఇది ప్రమాదం, బాధ కావచ్చు.. కానీ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాపై చూపించే ప్రేమకు మంత్రముగ్దుడ్ని అవుతున్నాను' అనే వాయిస్ మెసేజ్‌ను ప్రైవేటు ఆసుపత్రి నుంచి కమల్ పంపారు.

రమ్యకృష్ణ సైతం
ఇందులో కమల్ వైఫ్‌గా రమ్యకృష్ణ నటిస్తోంది. బాహుబలి 2లో నటిస్తున్న ఆమె, శభాష్ నాయుడు కోసం రీసెంట్‌గా అమెరికా వెళ్లి వచ్చింది.