»   » 'సూపర్‌గుడ్‌ ఫిలింస్‌' పై ఐటీ దాడులు

'సూపర్‌గుడ్‌ ఫిలింస్‌' పై ఐటీ దాడులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
IT Raids On Super Good Films Office In Chennai
చెన్నై : ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరికి చెందిన సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మాణ సంస్థపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థ ప్రముఖ హీరో విజయ్‌తో 'జిల్లా' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం సంస్థకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అధికారులుగానీ, నిర్మాణ సంస్థగానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


'సూపర్‌గుడ్‌ ఫిలింస్‌' ప్రస్తుతం జిల్లా చిత్రం చేస్తున్ననారు. ఇలయ తలబది విజయ్‌ ఈ చిత్రంలో హీరో. విజయ్ చిత్రమంటే యాక్షన్‌ సన్నివేశాలకు పెట్టిందిపేరు. ఆయన కొత్త సినిమా 'జిల్లా'లోనూ ఇదే పంథా కొనసాగించనున్నారు. ఇందులో అడవిలో విజయ్‌- మోహన్‌లాల్‌ సంయుక్తంగా రౌడీలతో పోరాడే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌ నిలుస్తాయంటోంది యూనిట్‌. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మాణంలో కొత్త దర్శకుడు నేశన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. మహత్‌, సూరి, తంబిరామయ్య, పూర్ణిమ భాగ్యరాజ్‌, నివేద, సంపత్‌, చరణ్‌, రవిమారియా, ప్రదీప్‌రావత్‌, బ్లాక్‌పాండి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. సంగీతం: డి.ఇమాన్‌, ఛాయాగ్రహణం: గణేశ్‌ రాజ్‌వేల్‌, నృత్యాలు: రాజుసుందరం, శ్రీధర్‌, స్టంట్స్‌: సిల్వా.


ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో రూ.కోటి వ్యయంతో అడవి సెట్‌ను రూపొందించారు. ఓ పోరాట సన్నివేశాన్ని ఇటీవలే అక్కడ తెరకెక్కించారట. ఇందులో విజయ్‌, మోహన్‌లాల్‌ కలిసి నలభై మంది రౌడీలతో భీకరంగా పోరాడే దృశ్యాలు తీశారట. అత్యాధునిక కెమెరాతోపాటు మొత్తం ఆరింటితో చిత్రీకరించారట. ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించటం ఖాయమని యూనిట్‌ పేర్కొంది.

English summary
Income Tax officials have raided the offices of RB Chowdary's production house Super Good Films in T Nagar, Chennai continuing from where they left it on the 31st October this year when they raided several top producers and film personalities' offices and houses in Chennai. The outcome of the raid is yet to be ascertained. I-T officials said they would collect all relevant documents and details to substantiate their charge that the producer had accrued wealth disproportionate to his known sources of income. Further course of action will be decided based on the documents seized, they said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu